BhadraKaali: విజయ్ అంటోని ‘భద్రకాళి’ ట్రైలర్! మరో.. హిట్ పక్కా
ABN, Publish Date - Sep 10 , 2025 | 05:44 PM
మార్గన్ సినిమాతో మంచి విజయం దక్కించుకున్న విజయ్ అంటోని (Vijay Antony) నుంచి మస్తున్న మరో కొత్త చిత్రం ‘భద్రకాళి.
రెండు నెలల క్రితం మార్గన్ సినిమాతో మంచి విజయం దక్కించుకున్న విజయ్ అంటోని (Vijay Antony) నుంచి మస్తున్న మరో కొత్త చిత్రం ‘భద్రకాళి’(Bhadra Kaali). పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రం విజయ్ 25వ చిత్రం కావడం విశేషం. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బాట్, రియా జితు, మాస్టర్ కేశవ్ కీలక పాత్రలు పోషించారు. గతంలో తమిళంలో అరువి వంటి సినిమాను డైరెక్ట్ చేసిన అరుణ్ ప్రభు (Arun Prabu) దర్శకుడు. ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఆఫీసియల్ ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్‌ను చూస్తే .. మొదట కాస్త అర్ధం కకాకుండా ఉన్నప్పటికీ పాలిటిక్స్‌ను చాలా లోతుగా అన్వేషించి, ఏదో గట్టిగానే ఫ్లాన్ చేశారు అనేలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటివరకు రాజకీయ నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు భిన్నంగా.. నేటి సమాజంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా ‘ఆద్యంతం ఆసక్తి కలిగించేలా థ్రిల్లర్‌గా సినిమాను రూపొందించినట్లు అర్థమవుతోంది. పలువురు ప్రజా ప్రతినిధులకు నమ్మినబంటుగా ఉన్న వ్యక్తి సడన్‌గా మారిపోవడం, అతని చుట్టూ వేల కోట్ల లావాదేవీల వ్యవహరాలు ఉండడం అందుకు ఆ నాయకులు హీరోను అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలు, దానిని ఆ హీరో ఎలా ఎదుర్కొన్నాడనే పాయింట్‌తో సినిమా ఉండనుంది.