Peddi: పెద్దికి బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ కి ఏంటి సంబంధం

ABN , Publish Date - Nov 29 , 2025 | 05:14 PM

రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది (Peddi).

Peddi

Peddi: రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది (Peddi). వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ నటుడు శివన్న కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ఫస్ట్ షాట్, ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి సాంగ్ ఏ రేంజ్ లో రికార్డులు సృష్టించాయో అందరికీ తెల్సిందే ఇక వచ్చే ఏడాది సమ్మర్ కి పెద్ది రిలీజ్ కు సిద్దమవుతుంది.

ఇక ఉదయం నుంచి పెద్దికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే.. పెద్ది సినిమాలో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ అంటూ వార్తలు వస్తున్నాయి. అదెంటిఇ విక్కీ కౌశల్ ని ఎందుకు తీసుకున్నారు. అసలు బుచ్చి ఏం ప్లాన్ చేస్తున్నాడు.. ? అంటూ అందరూ బుర్రలు గోక్కుంటున్నారు. అయితే అసలు నిజం ఏంటంటే.. పెద్ది సినిమాకు విక్కీ కౌశల్ తండ్రి శ్యామ్ కౌశల్ వర్క్ చేస్తున్నాడు. శ్యామ్ కౌశల్ ఒక స్టంట్ కొరియోగ్రాఫర్ అన్న విషయం అందరికీ తెల్సిందే.

శ్యామ్ కౌశల్.. దంగల్ సినిమాకు పని చేశాడు. అలాంటి స్టంట్స్ కోసమే బుచ్చి ఏరికోరి శ్యామ్ కౌశల్ ని పెద్ది కోసం రంగంలోకి దింపాడట. ప్రస్తుతం చిత్ర బృందం రామ్ చరణ్ తో పాటు ఫైటర్స్ తో కూడిన కీలకమైన మరియు హై-ఇంటెన్సిటీ ఫైట్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ యాక్షన్ సీక్వెన్స్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నారు. దీనికోసం ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఒక భారీ సెట్ ని నిర్మించారు.

ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ ని శ్యామ్ కౌశల్ పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ సినిమాకు హైలైట్ గా ఉండబోతుందని అంటున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో మెగా ఫ్యాన్స్ పెద్దిపై అంచనాలను మరింత పెంచేసుకున్నారు. ఇదే పెద్ది సినిమాకు విక్కీ కౌశల్ కి ఉన్న సంబంధం అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Nov 30 , 2025 | 10:57 AM