Mirai Song: సాంగ్ లోనే కాదు.. కుర్రాడిలో కూడా మంచి వైబ్ ఉందిగా
ABN, Publish Date - Jul 26 , 2025 | 03:27 PM
నేనున్నా నాయనమ్మ.. అంటూ ఇంద్రలో తొడగొట్టిన చిన్నోడు తేజ సజ్జా (Teja Sajja) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Mirai Song: నేనున్నా నాయనమ్మ.. అంటూ ఇంద్రలో తొడగొట్టిన చిన్నోడు తేజ సజ్జా (Teja Sajja) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో ఆ పిల్లాడి కసి చూసి.. వీడు కచ్చితంగా స్టార్ అవుతాడు అని ఎంతమంది అనుకున్నారో తెలియదు కానీ, ఇప్పుడు అదే నిజమైంది. సాధారణంగా బాల నటులుగా కెరీర్ ను మొదలుపెట్టి హీరోలుగా మారడం చిన్న విషయమే. కానీ, ఈ పోటీ ప్రపంచంలో మంచి కథలను ఎంచుకొని.. ప్రేక్షకులను అలరించి నిలబడడం మాత్రం చాలా కష్టంతో కూడుకున్న పని.
తేజ సజ్జా కూడా ఇప్పుడు అదే కష్టాన్ని నమ్ముకున్నాడు. హీరోగా గ్రాండ్ ఎంట్రీ లాంటివి ఏవి ప్లాన్ చేయకుండా ఓ బేబీ సినిమాతో ఒక సపోర్టివ్ రోల్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత జాంబీ రెడ్డి, అద్భుతం లాంటి సినిమాలతో ఒకే ఏడాది హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. జాంబీ రెడ్డి సినిమా మంచి విజయాన్ని అందుకోగా.. అద్భుతం కొద్దిగా నిరాశ పర్చింది. ఇక ప్రతి నటుడుకు వారి కెరీర్ ను మలుపు తిప్పే ఒక సినిమా ఉంటుంది. తేజ సజ్జాకు అలాంటి సినిమానే హనుమాన్.
గతేడాది సంక్రాంతికి స్టార్ హీరోల మధ్యన చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ ను సృష్టించి ఒక్కసారిగా తేజను కూడా పాన్ ఇండియా హీరోగా మార్చేసింది. ఇక ఈ హనుమాన్ తరువాత తేజ రేంజ్ కూడా మారిపోయింది. ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారాడు. అవార్డులు, సన్మానాలతో కొన్నిరోజులు సోషల్ మీడియా అంతా తేజ గురించే చర్చ.
ఈ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్నాకా.. తేజ ఆ తరువాత ఏం సినిమాను ఓకే చేస్తాడో అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసారు. ఇక వారిని నిరాశపర్చకుండా తేజ సూపర్ యోధ కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మిరాయ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తేజ సరసన రితికా నాయక్ నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్ గా కనిపిస్తున్నాడు.
ఇప్పటికే మిరాయ్ నుంచి రిలీజైన పోస్టర్స్. టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా అంచనాలను ఆకాశానికి తాకేలా చేసింది. ఇక మిరాయ్ సెప్టెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. సినిమా నుంచి ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే తాజాగా మిరాయ్ నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు. వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
నిజం చెప్పాలంటే ఈ సాంగ్ లో ఫుల్ వైబ్ ఉంది. ఒక ఫ్లూట్ మ్యూజిక్ తో మొదలైన ఈ సాంగ్.. మొత్తంలో పార్టీ వైబ్ ను నింపేశారు. ఒక పక్క రిథమ్.. ఇంకోపక్క శాస్త్రీయ సంగీతం.. మరోపక్క మాస్ బీట్.. ఇలా అన్ని కవర్ చేశారు. గౌర హరి సంగీతం చాలా గా అనిపిస్తుంది. కృష్ణ కాంత్ అందించిన లిరిక్స్ ఒక ఎత్తు అయితే.. వాటిని తన మధురమైన గాత్రంతో ఇంకో లెవెల్ కు తీసుకెళ్లాడు అర్మాన్ మాలిక్. ప్రేయసి ప్రేమలో తేలియాడుతున్న ఒక నవతరం యువకుడు.. తన ప్రేమ భావాలను సోషల్ మీడియా లాంగ్వేజ్ లో తెలుపుతున్నట్లు సాంగ్ ఉంది/.
ఇక సాంగ్ లో హైలైట్ అంటే తేజ సజ్జా అనే చెప్పొచ్చు. కుర్రాడు సాంగ్ లో డ్యాన్స్ ను కుమ్మేశాడు. అల్ట్రా స్టైలిష్ లుక్ ల.. ఆ స్టెప్స్, డ్రెస్సింగ్ .. ఒక పాప్ మ్యూజిక్ ఆల్బమ్ ను చూస్తున్న ఫీల్ ను తెప్పించాడు. ఇంకోపక్క రితికా అందాలు. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో పద్దతిగా, అమాయకంగా కనిపించిన ఈ చిన్నది.. ఈ సాంగ్ లో గ్లామర్ లుక్ లో గిలిగింతలు పెట్టేసింది. ఒక్కసారి వింటే.. మైండ్ లో నుంచి పోయి పాటలా అనిపించడం లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది వైబ్ ఉన్న పాటల్లో ఈ పాట మొదటి వరుసలో ఉండేలానే ఉంది. మొదటి సాంగ్ తోనే సినిమాపై మరింత వైబ్ తీసుకొచ్చేశాడు దర్శకుడు. మరి ముందు ముందు సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి.. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Pawan Fans in London: మీ రూల్స్ ఎవరికి చెప్పారు.. ఎక్కడ పెట్టారు..
Murali Mohan - Athadu: అతడు రీ రిలీజ్.. ఈసారి పక్కా హిట్..