సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thulasi: సినిమాల‌కు.. ఇక సెల‌వు! నటనకు వీడ్కోలు.. పలికిన న‌టి తులసి

ABN, Publish Date - Nov 19 , 2025 | 05:35 AM

ప్రముఖ నటి తులసి డిసెంబరు 31 నుంచి నటనకు వీడ్కోలు. 300కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె రిటైర్‌మెంట్‌ను సాయిబాబాకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

Thulasi

ప్రముఖ నటి తులసి (Thulasi) తన దశాబ్దాల సినీ ప్రస్థానానికి ముగింపు పలికారు. డిసెంబరు 31 నుంచి అధికారికంగా రిటైర్‌మెంట్‌ తీసుకుంటున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించారు. తన రిటైర్‌మెంట్‌ జీవితాన్ని షిరిడీ సాయిబాబాకు అంకితం చేస్తున్నట్లు ఆమె తెలిపి అభిమానులను భావోద్వేగానికి గురిచేశారు. 1967లో బాలనటిగా రంగప్రవేశం చేసిన తులసి ఇప్పటి వరకు సుమారు 300కు పైగా తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, భోజ్‌పురి చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సాధించారు.

వివ‌రాల్లోకి వెళితే.. ప్రముఖ నటి తులసి తన నట ప్రస్థానానికి వీడ్కోలు పలికారు. డిసెంబరు 31న షిరిడీ దర్శనానికి వెళ్తున్నానని, ఆ రోజు నుంచే తన రిటైర్‌మెంట్‌ ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. రిటైర్‌మెంట్‌ జీవితాన్ని సాయిబాబాకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

1967లో తులసి సినీ రంగ ప్రవేశం చేశారు. 1974లో బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘ఆరంగేట్రం’లో బాలనటిగా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, భోజ్‌పురి భాషల్లో సుమారు 300 చిత్రాల్లో నటించారు. కన్నడ దర్శకుడు శివమణిని వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం నటనకు విరామం ఇచ్చారు. ఆనంతరం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చారు.

విశ్వ‌నాధ్ సినిమాల్లో ఎక్కువ‌గా న‌టించిన తుల‌సికి బాల‌న‌టిగా శంక‌రాభ‌ర‌ణం ఎన‌లేని కీర్తిని తీసుకు వ‌చ్చింది. ఆ త‌ర్వాత చిరంజీవి హీరోగా వ‌చ్చిన శుభ‌లేఖ‌ సినిమాలో సుధాక‌ర్‌కు జోడీగా మెప్పించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు.

Updated Date - Nov 19 , 2025 | 05:35 AM