Venky Atluri: నాగ చైతన్యకు ఐదు కథలు చెప్పా.. కానీ
ABN , Publish Date - Jun 29 , 2025 | 03:24 PM
టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Venky Atluri: టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన వెంకీ.. తొలిప్రేమ సినిమాతో డైరెక్టర్ గా మారిన వెంకీ అట్లూరి.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్నిఅందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత వెంకీ నాలుగు సినిమాలు తెరకెక్కించాడు. మిస్టర్ మజ్ను, రంగ్ దే, సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరును తెచ్చుకున్నాడు. ముఖ్యంగా సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో వంద కోట్ల క్లబ్ లో చేరాడు.
ఇక ప్రస్తుతం వెంకీ.. సూర్యతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఈమధ్యనే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకొని సెట్స్ మీదకు వెళ్ళింది. ఇక సూర్య సినిమా తరువాత వెంకీ .. నాగ చైతన్యతో ఒక సినిమా చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక తాజాగా వెంకీ అట్లూరి ఒక ఇంటర్వ్యూలో నాగ చైతన్య గురించి చెప్పుకొచ్చాడు.
' మీరు నమ్మరు కానీ, నేను చేసిన ఐదు సినిమా కథలను మొదట నాగచైతన్యకే వినిపించాను. తొలిప్రేమ దగ్గర నుంచి లక్కీ భాస్కర్ వరకు అన్ని కథలను చైకు వినిపించాను. డేట్స్ అడ్జెస్ట్ అవ్వక, వేరే ఇతర కారణాల వలన మేము కలిసి పనిచేయలేదు' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక దీంతో వీరి కాంబోలో ఒక సినిమా వస్తే బావుంటుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక ఈ వార్త విన్నాక కొంతమంది మంచి ఛాన్స్ లను వదులుకున్నాడు. ఆ సినిమాలు చేస్తే ఇప్పటికే స్టార్ హీరో అయ్యిపోయేవాడు అని అంటుండగా.. ఇంకొందరు మంచి పని అయ్యింది.. లేకపోతే హిట్ అయ్యే సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక చై కెరీర్ గురించి చెప్పాలంటే తండేల్ లాంటి హిట్ తో జోరు పెంచేసిన చై .. ప్రస్తుతం విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో NC24 సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవ్వనుంది.
Ee Nagaraniki Emaindi 2: ఈ నగరానికి ఏమైంది2.. మొదలు పెట్టారు