Ee Nagaraniki Emaindi 2: ఈ నగరానికి ఏమైంది2.. మొద‌లు పెట్టారు

ABN , Publish Date - Jun 29 , 2025 | 01:47 PM

ఏడేండ్ల‌ క్రితం అనామ‌కంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి తెలుగు యూత్‌ని ఉర్రుతలూగించిన కల్ట్ క్లాసిక్ సినిమా ఈ నగరానికి ఏమైంది

Ee Nagaraniki Emaindi

స‌రిగ్గా ఏడేండ్ల‌ క్రితం అనామ‌కంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి తెలుగు యూత్‌ని ఉర్రుతలూగించిన కల్ట్ క్లాసిక్ సినిమా ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi). పెళ్లి చూపులు వంటి మంచి హిట్ త‌ర్వాత త‌రుణ్ భాస్క‌ర్ (Tharun Bhascker) ఈ సినిమాకు ద‌ర్వ‌క‌త్వం వ‌హించాడు. అయితే థియేట‌ర్‌లో కాస్త నిరాశ ప‌ర్చిన ఈ మూవీ ఆ త‌ర్వాత ఓటీటీకి వ‌చ్చి క‌ల్ట్ కాస్లిక్ గుర్తింపును తెచ్చుకుంది. ఆపై ద‌ఫాద‌ఫాలుగా రీ రిలీజ్ అయి భారీ వ‌సూళ్లు సాధించాయి. యూత్‌లో సెన్సేషనల్ క్రేజ్ ఉన్న ఈ సినిమా ఇప్పటికీ ఏదో ఒక స‌మ‌యంలో ట్రెండింగ్‌లోనే ఉంటుంది.

Ee Nagaraniki Emaindi

అయితే ఈ మూవీ టీమ్ నుంచి వచ్చిన ఒక సెన్సేషనల్ అప్డేట్ ప్రస్తుతం యూత్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ సినిమాకు కొన‌సాగింపుగా సెకండ్ పార్ట్ త్వ‌ర‌లో ఉంటుంద‌ని ప్ర‌క‌టిస్తూ వ‌చ్చిన మేక‌ర్స్ ఇప్పుడు ఆ వార్త‌ల‌ను నిజం చేశారు. తాజాగా ఆదివారం ఈ మూవీకి సంబంధించి కీల‌క అప్డేట్ ఇస్తూ ఈ నగరానికి ఏమైంది రీపీట్ అనే పేరుతో సినిమాను ప్రారంభిస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టిస్తూ ఓ చిన్న వీడియోను, పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. మేకర్స్ నుంచి వచ్చిన ఈ అప్డేట్‌తో ఫాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Ee Nagaraniki Emaindi

మొద‌టి భాగంలో న‌టించిన‌ విశ్వక్ సేన్ (Vishwak Sen), అభినవ్ గోమతం (Abhiinav Gomatam), వెంకటేష్ కాకుమాను (Venkatesh Kakumanu), సుశాంత్ రెడ్డి (Sai Sushanth Reddy) లు ఈ సినిమాలో కంటిన్యూ కానున్నారు. ఈ సినిమా ఎస్-ఒరిజినల్స్ బ్యానర్‌పై శ్రుజన్ యరబోలు నిర్మిస్తుండ‌గా తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) డైరెక్ష‌న్ చేస్తున్నాడు. ఈ సారి కూడా చిత్రానికి సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ (Suresh Productions) నుంచి రానా దగ్గుబాటి భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా ఈ సినిమా 2026లో రిలీజ్ చేయడానికి మేక‌ర్స్‌ ప్లాన్ చేస్తున్నారు.

Updated Date - Jun 29 , 2025 | 02:00 PM