Venkatesh: డిసెంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్
ABN, Publish Date - Nov 22 , 2025 | 11:10 AM
తెర వెనుక ఒకరు.. తెరమీద మరొకరు.. ఇద్దరూ కలిసిన ఆ మేజిక్ ను ఎవరూ మరిచిపోలేరు. క్లీన్ కామెడీకి సరికొత్త అర్థం చెప్పిన సినిమాలు అవి. అలాంటి కాంబోని చూసి ఆడియెన్స్ కు దశాబ్దాలే అయింది.. అయితే ఇప్పుడు పట్టాలెక్కడమే కాదు.. పరుగులూ అందుకోవడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
విక్టరీ వెంకటేశ్(Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరీ' సినిమాల్లో వారి మాటలు చేసిన మ్యాజిక్ ప్రతి ప్రేక్షకుడు ఇప్పటికీ ఎంజాయ్ చేస్తుంటాడు. అలాంటి కాంబోలో ఇప్పుడు సినిమా రావడం.. అది కూడా మాటలతో పాటు డైరెక్షన్ చేయడం ఎంతో ఆసక్తికరంగా మారింది. ఈ సారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది కానీ అప్డేట్స్ లేకుండా పోయాయి. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
వెంకటేశ్ ప్రస్తుతం చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ నెలాఖరులోగా ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తవుతుంది. డిసెంబర్ మొదటి వారంలో చిరంజీవి , వెంకటేశ్ పై ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరగనుంది. అనంతరం వెంకటేశ్ నేరుగా త్రివిక్రమ్ సినిమా సెట్‌పైకి వెళ్లిపోతాడని తెలుస్తోంది. డిసెంబర్ 15 నుంచి ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. డిసెంబర్ చివరి వరకు నాన్‌స్టాప్ షూటింగ్ జరుపుకుంటూ, సంక్రాంతి బ్రేక్ తర్వాత జనవరి నుంచి మళ్లీ బ్రేక్ లేకుండా కొనసాగనుంది.
త్రివిక్రమ్ ప్లాన్ ప్రకారం ఈ సినిమా 2026 మేలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేసి, వెంకటేశ్ తర్వాత ‘దృశ్యం 3’లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. 'కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. వెంకీ తో పాటు ఈ బ్యూటీ కూడా డిసెంబర్‌లోనే సెట్స్‌లో జాయిన్ కానుంది.ఈ ఇద్దరిపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు టాక్. ఈ చిత్రానికి మ్యూజిక్ సంచలనం హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. అన్ని సెట్ అవ్వడంతో నాన్ సాప్ గా షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారట. మరి వెంకీ, త్రివిక్రమ్ మళ్లీ కలిస్తే… స్క్రీన్ మీద మ్యాజిక్ ఖాయమని ఫిక్స్ అయిపోయారు అభిమానులు.