Veede Mana Vaarasudu: కదిలించే భావోద్వేగాలతో
ABN, Publish Date - Jul 09 , 2025 | 06:20 AM
రమేశ్ ఉప్పు కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘వీడే మన వారసుడు’. లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లు. ఈ నెల 18న...
రమేశ్ ఉప్పు కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘వీడే మన వారసుడు’. లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లు. ఈ నెల 18న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత రమేశ్ ఉప్పు మాట్లాడుతూ ‘‘రైతుల కష్టాలను అర్థవంతంగా ఆవిష్కరించిన చిత్రమిది. ఇందులోని భావోద్వేగాలు ప్రతీ ఒక్కరినీ కదిలిస్తాయి’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఏ మల్‌రెడ్డి రంగారెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.