సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

VT15: వరుణ్‌తేజ్‌ని యునీక్‌ లుక్‌లో చూపించే ప్రయత్నం..

ABN, Publish Date - Jun 17 , 2025 | 02:10 PM

వరుణ్‌తేజ్‌ ఫెయిల్యూర్‌ని పక్కన పెట్టి గ్యాప్‌ ఇవ్వకుండా తన 15వ (VT15) చిత్రానికి శ్రీకారం చుట్టారు.


వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌(varun tej). తాజాగా వచ్చిన మట్కా కూడా నిశారే మిగిల్చింది. అయితే వరుణ్‌తేజ్‌ ఫెయిల్యూర్‌ని పక్కన పెట్టి గ్యాప్‌ ఇవ్వకుండా తన 15వ (VT15) చిత్రానికి శ్రీకారం చుట్టారు. మేర్లపాక గాంధీతో  (Merlapaka gandhi) ప్రస్తుతం ఆయనొక సినిమా చేస్తున్నారు. ఈ మధ్యనే ఈ చిత్రం గురించి మేకర్స్‌ ప్రకటించారు. ఇటీవల తన భార్య లావణ్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన వరుణ్‌ తేజ్‌ తిరిగి వచ్చి తాజా ప్రాజెక్ట్‌పై దృష్టిపెట్టారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ కొరియాలో జరుగనుందని చిత్ర వర్గాల నుంచి సమాచారం. కొరియాలో ఈ షెడ్యూల్‌ దాదాపు 45 రోజులపాటు ఉంటుందట. దీంతో 90 శాతం చిత్రీకరణ పూర్తవుతుందని తెలిసింది.



వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాలో లుక్‌ కోసం తనని తాను మార్చుకుంటున్నారు. ఇందులో భిన్నమైన లుక్‌లో కనిపిస్తారని, ప్రత్యేక మేనరిజం ఉంటుందని తెలుస్తోంది. ఇందులో రితికా నాయక్‌ కథానాయికగా నటిస్తుండగా, సత్య ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Updated Date - Jun 17 , 2025 | 02:10 PM