సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Constable: వ‌రుణ్ సందేశ్‌.. కానిస్టేబుల్ ట్రైల‌ర్‌

ABN, Publish Date - Aug 31 , 2025 | 05:42 PM

గ‌త సంవ‌త్స‌రం రెండు విభిన్న‌చిత్రాల‌తో అల‌రించిన వ‌రుణ్ సందేశ్ క‌థానాయ‌కుడిగా రూపొందించిన కొత్త సినిమా ‘కానిస్టేబుల్‌’.

Varun Sandesh

గ‌త సంవ‌త్స‌రం రెండు విభిన్న‌చిత్రాల‌తో అల‌రించిన వ‌రుణ్ సందేశ్ (Varun Sandesh) క‌థానాయ‌కుడిగా రూపొందించిన కొత్త సినిమా ‘కానిస్టేబుల్‌’(Constable). మ‌ధులిక వార‌ణాసి (Madhulika Varanasi) క‌థానాయిక‌గా న‌టించ‌గా ర‌వి వ‌ర్మ‌, ముర‌ళీ ధ‌ర్ గౌడ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఆర్యన్‌సుభాన్‌ ఎస్‌.కే (Aryan Subhan S.K) దర్శకత్వంలో బలగం జగదీశ్‌ నిర్మించారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పాట మంచి స్పంద‌న‌ను తీసుకు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

ఔట్ అండ్ ఔట్ క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రం రూపొందిన‌ట్లు ఈ మూవీ ట్రైలర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఓ ప్రాంతంలో వ‌రుస హ‌త్య‌లు జ‌రుగ‌డం, అప్పుడే కొత్త‌గా విధుల్లోకి వ‌చ్చిన కానిస్టేబుల్ ఈ కేసు విష‌యంలో ఆస‌క్తి చూప‌డం త‌ద‌నంత‌రం జ‌రిగిన ప‌రిణామాలు, ఎందుకు హ‌త్య‌లు చేస్తున్నారు, ఎంత‌మంది ఉన్నారు, హీరో ఎలా ఎదుర్కొన్నాడ‌నే క‌థ‌క‌థ‌నాల నేప‌థ్యంలో సినిమా మంచి థ్రిల్లింగ్ జాన‌ర్‌లో సాగ‌నుంది. అయితే.. ప్రొడ‌క్ష‌న్ స్టాండ‌ర్డ్స్ విష‌యంలో చాలా వెనుక‌బ‌డ్డ‌ట్టు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది.

Updated Date - Aug 31 , 2025 | 05:42 PM