సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Varun Sandesh: సమాజంలోని.. అరాచక పోకడలను ఎత్తిచూపాం

ABN, Publish Date - Oct 08 , 2025 | 09:57 AM

వరుణ్‌ సందేశ్ (Varun Sandesh) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కానిస్టేబుల్‌’.

Varun Sandesh

వరుణ్‌ సందేశ్ (Varun Sandesh) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కానిస్టేబుల్‌’(CONSTABLE). మధులికా వారణాసి (Madhulika Varanasi) కథానాయిక. ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌కే దర్శకత్వంలో బలగం జగదీశ్‌ నిర్మించారు. ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా.. వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ ‘సమాజంలో జరుగుతున్న కొన్ని అరాచక పోకడలను ఎత్తిచూపుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. వాణిజ్య హంగులతో పాటు వినోదం, సందేశం మేళవింపుగా దర్శకుడు తీర్చిదిద్దారు. నా తొలి చిత్రం ‘హ్యాపీ డేస్‌’ కూడా ఇదే నెల‌లో విడుదలైంది. ఈ సినిమా కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకోవాలి’ అని ఆకాంక్షించారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘ట్రైలర్‌, పాటలకు వచ్చిన స్పందన సినిమాపై మా నమ్మకాన్ని పెంచింది’ అని చెప్పారు. బలగం జగదీశ్‌ మాట్లాడుతూ ‘ఒక యువతి జీవితంలో తలెత్తిన అనూహ్య సంఘటనల సమాహారంగా ఈ చిత్రం ఉండబోతోంది. కుటుంబం అంతా కలసి చూడాల్సిన సినిమా ఇది’ అని అన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 09:57 AM