సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

One Way Ticket Movie: కొత్త పాత్రలో

ABN, Publish Date - Jul 28 , 2025 | 12:29 AM

వరుణ్‌ సందేశ్‌ హీరోగా ఏ.పళని స్వామి తెరకెక్కించనున్న ‘వన్‌ వే టికెట్‌’ అనే సినిమా పూజా కార్యక్రమాలతో ఆదివారం ప్రారంభమైంది. బొరిగే శ్రీనివాస రావు నిర్మిస్తున్నారు...

వరుణ్‌ సందేశ్‌ హీరోగా ఏ.పళని స్వామి తెరకెక్కించనున్న ‘వన్‌ వే టికెట్‌’ అనే సినిమా పూజా కార్యక్రమాలతో ఆదివారం ప్రారంభమైంది. బొరిగే శ్రీనివాస రావు నిర్మిస్తున్నారు. కార్యక్రమంలో నిర్మాత సి.కల్యాణ్‌, దర్శకుడు త్రినాధరావు నక్కిన, సంగీత దర్శకుడు సాయి కార్తిక్‌, నటి కుష్బూ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ ‘ఈ స్ర్కిప్ట్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నేను ఇందులో కొత్త పాత్రను పోషించబోతున్నాను’ అని అన్నారు. చిత్ర దర్శకుడు పళని స్వామి మాట్లాడుతూ ‘ఈ సినిమా క్రైమ్‌ థ్రిల్లర్‌గా రాబోతోంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌: శ్రీనివాస్‌ బెజుగమ్‌, సంగీతం: సాయి కార్తీక్‌.

Updated Date - Jul 28 , 2025 | 12:29 AM