Varsha Bollamma: మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను
ABN, Publish Date - Jul 04 , 2025 | 05:28 AM
తమ్ముడు సినిమా కోసం అడవిలో షూటింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇబ్బంది ఉంటే ముందే చెప్పండి అని...
‘తమ్ముడు’ సినిమా కోసం అడవిలో షూటింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇబ్బంది ఉంటే ముందే చెప్పండి’ అని దర్శకుడు వేణు శ్రీరామ్ నన్ను అడిగారు. ‘దీన్నొక సవాల్‌గా తీసుకొని నటిస్తాను’ అని ఆయనకు చెప్పాను. ఈ చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్ సైతం నేర్చుకున్నాను’ అని హీరోయిన్ వర్ష బొల్లమ్మ అన్నారు. నితిన్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రమిది. నేడు విడుదలవుతున్న సందర్భంగా వర్ష బొల్లమ్మ మీడియాతో ముచ్చటించారు.
కథ విన్నప్పడు నా పాత్ర కొత్తగా, సవాల్‌గా అనిపించింది. ఈ చిత్రంలో నితిన్‌కు సహాయపడే యువతిగా చిత్ర అనే పాత్రలో కనిపిస్తాను. కథలో నా పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. యాక్షన్ సన్నివేశాల్లో నటించేందుకు బాగా శ్రమించాల్సి వచ్చింది.
నితిన్ సెట్‌లో సరదాగా ఉంటారు. లయ కష్టపడే విధానం మాకు స్ఫూర్తినిచ్చింది. సన్నివేశం తను అనుకున్న విధంగా వచ్చేవరకూ వేణు శ్రీరామ్ ఓపిగ్గా పనిచేసేవారు. ప్రస్తుతం రెండు వెబ్‌సిరీ్‌సలు చేస్తున్నాను.