Varsha Bollamma: సిగ్గులేకుండా సిచ్యువేషన్ షిప్ లో ఉన్నా
ABN , Publish Date - Sep 05 , 2025 | 09:57 PM
అందాల భామ వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Varsha Bollamma: అందాల భామ వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం, అభినయం ఉన్న హీరోయిన్స్ లో వర్ష ఒకరు. అయితే ఈ ఏడాదిలో ఈ చిన్నది హిట్ అందుకుంటుంది అనుకున్నారు. నితిన్ సరసన తమ్ముడు సినిమాలో నటించింది. కానీ, ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఇది కాకుండా ఈటీవీ విన్ లో కానిస్టేబుల్ కనకం అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది.
ఇక ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న వర్ష.. కొద్దిగా గ్యాప్ తీసుకొని బీచ్ వెకేషన్ కు వెళ్ళినట్లు కనిపిస్తుంది. సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందులోనూ అమ్మది క్యాప్షన్స్ కు ఫిధా కానీ ప్రేక్షకుడు లేడు అతిశయోక్తి కాదు. ఫోటోకు ఫన్నీ కామెంట్స్ పెట్టడం, తనను తానే సెల్ఫ్ ట్రోల్ చేసుకోవడం, తల్లితో కలిసి జోక్ లు వేయడం.. వర్షకు బాగా అలవాటు. ట్రోల్స్ ను కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకుంటూ ఉంటుంది.
తాజాగా వర్ష.. బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. సముద్రం ఒడ్డున సందడి చేస్తూ.. నవ్వుతూ ఫోటోలకు పోజులిచ్చింది. బ్లూ కలర్ డెనిమ్ టాప్ లో థైస్ అందాలను ఎరగా వేసి పిచ్చెక్కించింది. ఇక ఈ ఫోటోస్ కు క్యాప్షన్ గా 'సిగ్గులేకుండా సిచ్యుయేషన్ షిప్ లో ఉన్నా' అంటూ రాసుకొచ్చింది. ఆ క్యాప్షన్ లో సీ (sea) అంటే సముద్రం అని ఇంగ్లీష్ లో చెప్పుకొచ్చింది. అంటే సముద్రంతో ఆటలు ఆడుతున్నట్లు చెప్పుకొచ్చిందన్న మాట. దీంతో నెటిజన్స్ భలే క్యాప్షన్స్ పెడతావ్ వర్ష అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Ashish Warang: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
Pawan Kalyan: ఓజీ.. ప్రమోషన్స్ కి వస్తాడా