SS Karthikeya: కొడుకు మొదటి స్పీచ్.. కన్నీళ్లు పెట్టుకున్న రమా రాజమౌళి
ABN, Publish Date - Nov 15 , 2025 | 08:05 PM
ఎట్టకేలకు గ్లోబ్ ట్రాటర్(Globe Trotter) ఈవెంట్ మొదలయ్యింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన SSMB29 టైటిల్ వారణాసి (Varaanaasi) అని అధికారికంగా తెలిపేశారు.
SS Karthikeya: ఎట్టకేలకు గ్లోబ్ ట్రాటర్(Globe Trotter) ఈవెంట్ మొదలయ్యింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన SSMB29 టైటిల్ వారణాసి (Vaaranaasi) అని అధికారికంగా తెలిపేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వస్తున్న చిత్రం వారణాసి. ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను కేఎల్ నారాయణతో కలిసి రాజమౌళి - రమా ల కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ నిర్మించాడు.
ఇక ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో ఎస్ ఎస్ కార్తికేయ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. నిర్మాతగా చిన్న చిన్న సినిమాలు చేస్తూ వస్తున్న తనకు ఇంత పెద్ద సినిమా చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. ఇలాంటి పెద్ద సినిమా చేయడానికి తనకు 15 ఏళ్ళు అయినా పడుతుందని అనుకున్నానని, కానీ, ఇంత త్వరగా ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలని తెలిపాడు.
ప్రస్తుతం గ్లోబల్ సినిమాను మొత్తం హైదరాబాద్ తీసుకొచ్చామని.. ఇక్కడ ఇలాంటి ఈవెంట్ చేయడం ఎంతో అద్భుతమని, దానికోసం కష్టపడినవారందరికీ థాంక్స్ అని చెప్పుకొచ్చాడు. ఇక మొదటిసారి ఇంత పెద్ద స్పీచ్ ఇవ్వడంతో తల్లి రమా రాజమౌళి కన్నీళ్లు పెట్టుకుంది కోడలు పక్కన ఓదారుస్తుంటే ఒకపక్క నవ్వుతూ కొడుకు విజయాన్ని ఆనందిస్తూ కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.