Varanasi: ఒక్క పోస్టర్ ఎన్ని విషయాల్లో.. జక్కన్న ప్లాన్ మామూలుగా లేదుగా..
ABN, Publish Date - Nov 16 , 2025 | 01:23 PM
మహేశ్ బాబు(Mahesh Babu), రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో సినిమా అనగానే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. సూపర్‌స్టార్‌ను రాజమౌళి ఎలా చూపిస్తాడు? కథ ఎలా ఉండబోతోంది?
మహేశ్ బాబు(Mahesh Babu), రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో సినిమా అనగానే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. సూపర్‌స్టార్‌ను రాజమౌళి ఎలా చూపిస్తాడు? కథ ఎలా ఉండబోతోంది? టైటిల్ ఏదైతే యాప్ట్‌గా ఉంటుంది? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు సోషల్ మీడియాలో, అభిమానుల్లో చర్చ జరుగుతూనే ఉంది. ఈ ప్రశ్నలన్నింటికీ శనివారం రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌తో క్లారిటీ వచ్చేసింది. ‘వారణాసి’(Varanasi) టైటిల్ గ్లింప్స్‌తో వావ్ అనిపించారు జక్కన్న. అయితే ఈ కథలో కాన్సెప్టులు, లేయర్లు ఉండటంతో.. అసలు ఈ సినిమా ఏఏ జనార్‌లతో రూపొందుతోంది అన్న చర్చ మొదలైంది. అయితే తాజాగా వదిలిన టైటిల్ లోగోను గమనిస్తే అందులో ఎన్నో విషయాలు దగున్నాయి. ఓ లుక్ వేయండి..
లోగోలో ‘V’ నుంచి ‘A' వరకు లెటర్స్‌ను కవర్ చేసిన వక్ర గీత విల్లులా, మధ్యలోని ఎను రాజమౌళి పేరులోని ఓని కలిపే లైన్ బాణంలా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో రామాయణంలోని ఓ ఘట్టాన్ని చూపిస్తున్నానని, కొన్ని సన్నివేశాల్లో మహేశ్.. రాముడిగా కనిపిస్తారని రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రెండు లైన్లు.. రామాయణానికి ప్రతీక అనుకోవచ్చు. అలాగే మొదటి 'A' చివరి 'A' పై ఎగురుతున్న జెండాలను గమనించొచ్చు. వారణాసి, అయోధ్య దేవాలయాలపై ఎగిరే జెండాలను గుర్తు చేస్తున్నాయి. బాణం లాంటి లైన్.. గ్రహశకలం భూమి మీదకు దూసుకు వస్తున్నట్టుగా ఉంది. దీన్ని బట్టి.. ఈ కథలో సైన్స్‌ఫిక్షన్ కాన్సెప్ట్ కూడా లింక్ అయినట్లు తెలుస్తోంది. విల్లు బాణాన్ని తలపించే లైన్లను గడియారంలా అనుకుంటే అది టైమ్ ట్రావెల్‌ను సూచిస్తుంది. ఇలా దాదాపు కథా నేపధ్యాన్ని లోగోలోనే చెప్పే ప్రయత్నం చేశారు జక్కన్న. గ్లింప్స్ రాకముందు ఈ సినిమా జానర్‌ను అమేజాన్ అటవీ ప్రాంతంలో జరిగే భారీ అడ్వెంచర్ సినిమా అని ఎవరికి ఇష్టం వచ్చినట్లువారు ఊహించుకున్నారు. ఇప్పుడు మాత్రం ఇది ‘టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా అని చెబుతున్నారు.
ఇందులో మహేశ్.. రుద్ర పాత్రలో నటిస్తున్నారు. విలన్‌గా కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా.. మందాకినిగా కనిపించనుంది. 2027 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీదుర్గా ఆర్స్ట్ పతాకంపై కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.