సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హాలీవుడ్‌ చిత్రంలో వరలక్ష్మి

ABN, Publish Date - Jun 26 , 2025 | 02:07 AM

విభిన్న పాత్రలతో అందరినీ ఆకట్టుకుంటున్న వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఇప్పుడు హాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. బ్రిటీష్‌ నటుడు జెర్మీ ఐరెన్స్‌ సరసన ఆమె...

విభిన్న పాత్రలతో అందరినీ ఆకట్టుకుంటున్న వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఇప్పుడు హాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. బ్రిటీష్‌ నటుడు జెర్మీ ఐరెన్స్‌ సరసన ఆమె నటిస్తున్నారు. శ్రీలంకకు చెందిన సీనియర్‌ దర్శకుడు చంద్రన్‌ రత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఆ చిత్రం పేరు ‘రిజానా ఎ కేజ్డ్‌ బర్డ్‌’. ఓ యథార్థ కథ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. షూటింగ్‌ శ్రీలంకలో జరిగింది. ఈ చిత్రం గురించి వరలక్ష్మి వివరిస్తూ ‘ఆస్కార్‌ అవార్డ్‌ సాధించిన జెర్మీ ఐరన్స్‌ వంటి గొప్ప నటుడితో కలసి పని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నా కల నెరవేరినట్లుగా ఉంది. ‘లయన్‌ కింగ్‌’ చిత్రంలో స్కార్‌ పాత్రకు ఆయనే వాయిస్‌ ఇచ్చారు. అలాగే చంద్రన్‌ రత్నం శ్రీలంకకే కాదు ప్రపంచ సినిమాకే కొత్త దారులు చూపించిన దర్శకుడు. ఈ సినిమా ద్వారా నాకు ఓ అద్భుతమైన అవకాశం దొరకడం సంతోషంగా ఉంది’ అన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 02:08 AM