Vamsee Anr Global Film Journalist Award: సీనియర్ జర్నలిస్టులకు.. ప్రతిష్టాత్మక అవార్డు

ABN , Publish Date - Sep 19 , 2025 | 08:45 AM

అక్కినేని నాగేశ్వరరావు గారి 101వ జయంతి సందర్భంగా వంశీ ఆర్ట్స్ థియేట‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ‌ 2025 సంవ‌త్స‌రానికి అవార్డులు ప్రకటించారు.

vamshee awards

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి 101వ జయంతి సందర్భంగా వంశీ ఆర్ట్స్ థియేట‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ‌ 2025 సంవ‌త్స‌రానికి గాను డాక్టర్ పాల‌కోడేటి స‌త్య‌నారాయ‌ణ రావు సీనియర్ జర్నలిస్ట్ ఈటీవీ, యూ. వినాయ‌క రావు, సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్ర‌జ్యోతి, సుమ‌న్ టీవీ ఫిల్మ్ భ్యూరో చీఫ్ ప్రభుల‌కు వంశీ-ఏఎన్నార్ గ్లోబల్ ఫిల్మ్ జర్నలిస్టు అవార్డు-2025 (Vamsee-ANR Global Film Journalist Award-2025)ను ప్రకటించారు. ఈ వేడుక ఈ రోజు (శుక్ర‌వారం 19) సాయంత్రం 4:30 గంటలకు శ్రీ త్యాగరాయ గానసభ, చిక్క‌డ‌పల్లి, హైదరాబాద్‌లో జరగనుంది.

vamshee awards

వంశీ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు డాక్టర్ వంశీ రామ‌రాజు తెన్నేటి సుధాదేవి దంపతుల ఆధ్వ‌ర్యంలో నిర్వహించ‌నున్న ఈ కార్య‌క్ర‌మానికి జస్టిస్ డాక్టర్ శ్రీమతి జి. రాధా రాణి (తెలంగాణ హైకోర్టు గౌరవ న్యాయమూర్తి) ముఖ్య అతిథిగా హ‌జ‌రు కానున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రేలంగి న‌ర‌సింహా రావు స‌భాద్య‌క్ష‌త వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా అక్కినేని పాట‌కు ప‌ట్టాభిషేకంలో భాగంగా వైఎస్ రామ‌కృష్ణ‌, సురేఖామూర్తి, శివ‌శంక‌రి గీతాంజ‌లి వంటి గాయ‌కులు అక్కినేని సినిమాల్లోని పాట‌ల‌ను ఆల‌పించ‌నున్నారు.

Updated Date - Sep 19 , 2025 | 08:45 AM