Tollywood: వైభవంగా థియేటర్లలోకి....
ABN , Publish Date - May 12 , 2025 | 02:09 PM
ఇటీవల తెలుగులో 'యు' సర్టిఫికెట్ కు అర్హమయ్యే చిత్రాలు అరుదైపోయాయి. అందులో ఒకటి 'వైభవం' కావడం విశేషం.
రుత్విక్ (Ruthvik), ఇక్రా ఇద్రిసి(Iqra Idrisi) హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న సినిమా 'వైభవం' (Vaibhavam). విశేషం ఏమంటే... హీరోహీరోయిన్లతో పాటు కాస్టింగ్ కాల్ ద్వారా ఎంపిక చేసిన మరి కొంతమంది ప్రతిభావంతులు సైతం ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. రమాదేవి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి సాత్విక్ (Sathvik) రచన చేసి, దర్శకత్వం వహించారు.
ఇటీవలే 'వైభవం' సినిమా సెన్సార్ కార్యకలాపాలు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని మేకర్స్ చెబుతూ, 'ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు 'యు' సర్టిఫికెట్ రావడం అరుదుగా జరుగుతోందని, క్లీన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన తమ చిత్రానికి 'యు' సర్టిఫికెట్ లభించడం ఆనందాన్ని కలిగించిందని అన్నారు. మే 23న 'వైభవం' సినిమా జనం ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ నుండి రెండు పాటలను విడుదల చేశామని, వాటికి విశేష స్పందన లభించిందని దర్శకుడు సాత్విక్ తెలిపారు.
Also Read: Sree Leela: బాలీవుడ్ లో విజ్జిపాప జోరు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి