Sree Leela: బాలీవుడ్ లో విజ్జిపాప జోరు

ABN , Publish Date - May 12 , 2025 | 01:51 PM

'పెళ్లిసందడి' పిల్ల బాగానే మాయ చేస్తోంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఛాన్సులు భలేగా చేజిక్కించుకుంటోంది. స్టార్ హీరోయిన్లకు కూడా సాధ్యం కానీ రీతిలో కెరీర్ పరంగా ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకెళ్తోంది. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ ఈ ముద్దుగుమ్మ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం బీటౌన్ కూడా శ్రీలీల జపం చేయడం హాట్ టాపిక్ గా మారింది.

'పెళ్లిసందడి' (Pellisandadi) పిల్ల శ్రీలీల (Sree Leela) టాలీవుడ్, బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అదరగొడుతోంది. కుర్ర హీరోలతోపాటు సీనియర్ హీరోలతో చిందులేయడానికి రెడీ అయింది. పైగా ఆకర్షించే అందంతో పాటు ఆకట్టుకునే నటనతో అటు యూత్ ను, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ ‌ను చూపు తిప్పుకోకుండా చేస్తోంది. డ్యాన్సులతోనూ అందరితో విజిల్స్‌ వేయించుకుంటోంది. ఈ బ్యూటీ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. హైదరాబాద్ టు ముంబై అంటూ తెగ చక్కర్లు కొడుతోంది. తాజాగా బాలీవుడ్ లో మరో బిగ్ ప్రాజెక్ట్ కొట్టేసి హాట్ టాపిక్ గా మారిందీ అందాల సుందరి.


శ్రీలీలకు వరుసగా సినిమాలు చేస్తున్నా రాని పాపులారిటీ 'పుష్ప- 2' (Pushpa -2) కిస్సిక్ సాంగ్స్ తో వచ్చేసింది. 'ధమాకా' (Dhamaka) పిల్ల స్పెప్పులకు పాన్ ఇండియా షేక్ అవ్వడంతో పాటు కిస్సిక్ పిల్ల గా మారిపోయింది. దాంతో బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లను పట్టేస్తోంది. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ తో కలిసి 'ఆషికీ- 3' (Ashiqui -3) మూవీ చేస్తోంది. అలాగే సైఫ్ అలీఖాన్ కొడుకుతో ఇబ్రహీం అలీఖాన్ సినిమా కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తాజాగా మరో ఆఫర్ బ్యూటీ ఖాతాలో పడినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ బడా నిర్మాత కరన్ జోహార్ (Karan Johar) తన ధర్మ ప్రొడక్షన్స్ పై 'దోస్తానా -2 నిర్మిస్తున్నాడు. విక్రమ్ మాస్సే, లక్ష్య హీరోలుగా చేస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీల పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా విజ్జిపాపను అప్రోజ్ అవ్వగా... గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పేరు వినిపించింది. అయితే జాన్వీ వరుస సినిమాలతో బిజీగా మారడంతో... డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయిందట. దీంతో ఈ ఆఫర్ శ్రీలీలను వరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ గా న్యూస్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదే కనుకగా నిజమైంది... శ్రీలీల బాలీవుడ్ లో జెండా పాతేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: Pradeep Ranganadhan: వివాదంలో 'డ్యూడ్' టైటిల్...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 12 , 2025 | 01:51 PM