Rajamouli: సినిమాలకు రాజమౌళి గుడ్ బై..
ABN, Publish Date - Dec 20 , 2025 | 05:27 PM
సోషల్ మీడియాలో రూమర్స్ కి కొదువ లేదు. కానీ, కొన్ని రూమర్స్ మాత్రం చాలా అసహనానికి గురిచేస్తూ ఉంటాయి.
Rajamouli: సోషల్ మీడియాలో రూమర్స్ కి కొదువ లేదు. కానీ, కొన్ని రూమర్స్ మాత్రం చాలా అసహనానికి గురిచేస్తూ ఉంటాయి. అసలు ఇలాంటి రూమర్ ని ఎలా క్రియేట్ చేయగలిగారు అనే అనుమానం రాకమానదు. తాజాగా సోషల్ మీడియాలో ఒక రూమర్ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తుంది. అదేంటంటే.. దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడట. తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్ కి పరిచయం చేసిన దర్శకుడు.. ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేసిన ఘనత రాజమౌళికి మాత్రమే దక్కుతుంది.
ప్రస్తుతం తెలుగు సినిమాలు.. జపాన్, చైనా లాంటి దేశాల్లో రిలీజ్ అవుతున్నాయి అంటే దానికి కారణం జక్కన్ననే. పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సినిమాకు గుర్తింపు తెచ్చిన జక్కన్న ప్రస్తుతం వారణాసి సినిమాతో పాన్ వరల్డ్ లో గుర్తింపు తీసుకురావడానికి కష్టపడుతున్నాడు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ప్రస్తుతం వారణాసి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. వారణాసి తరువాత జక్కన్న సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడట. ఈ సినిమానే జక్కన్న చివరి చిత్రం అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మహాభారతాన్ని తెరకెక్కించడం రాజమౌళి డ్రీమ్ అని అందరికి తెలుసు. వారణాసి తరువాత ఆయన దానిమీదనే దృష్టి పెట్టనున్నాడట. సినిమాలను పక్కన పెట్టి.. కథను రాసుకోవడం, క్యాస్టింగ్ వెతకడం లాంటివి చేసి.. మహాభారతాన్ని ఒక వెబ్ సిరీస్ గా తెరకెక్కించడానికి పూనుకున్నాడని, అప్పటివరకు ఆయన సినిమాలు చేయడు అని చెప్పుకొస్తున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఇదే నిజమైతే మాత్రం ఇండియన్ సినిమా తన ఉనికిని కోల్పోతుందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి దీనిపై జక్కన్న స్పందిస్తాడేమో చూడాలి.