Ustaad Bhagat Singh: ఉస్తాద్.. ఫస్ట్ సాంగ్ ప్రోమో ఎప్పుడంటే..
ABN, Publish Date - Dec 07 , 2025 | 07:17 PM
పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైతీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం గురించి అప్‌డేట్ గురించి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు.
పవన్ కళ్యాణ్ (Pawan kalyan) హీరోగా హరీశ్ శంకర్ Harish shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (ustaad Bhagat singh) మైతీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం గురించి అప్‌డేట్ గురించి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’తో పవన్‌కు, హరీశ్ శంకర్‌కు చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన మ్యూజిక్ మిసైల్ దేవిశ్రీప్రసాద్ దానికి మించిన సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రాబోతుంది. ఇటీవల మేకింగ్ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు దర్శకుడు. తాజాగా దీని అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. డిసెంబర్ 9 సాయంత్రం ఆరున్నర గంటలకు సాంగ్ ప్రోమో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించగా విశాల్ దడ్లాని ఆలపించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. ఆల్రెడీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. వచ్చే ఏడాది థియేటర్లలోకి సినిమాను తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.