Upendra: ఈ సినిమాకి నేను ఫ్యాన్ అయిపోయా..ఉపేంద్ర మాటలకు రామ్ షాక్
ABN, Publish Date - Nov 20 , 2025 | 09:50 AM
‘ఆంధ్రా కింగ్ తాలూకా ప్రతి ఒక్క ఫ్యాన్ కోసం తీసిన సినిమా అని వారి లైఫ్‌ను సినిమాలో అద్భుతంగా చూయించారని, నేను ఈ చిత్రానికి ఫ్యాన్ అయిపోయా అని ఉపేంద్ర అన్నారు.
‘‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (Andhra King Taluka ) చిత్రం నన్ను చాలా భావోద్వేగానికి లోను చేసింది. ఈ కథకూ, ఇందులోని సాగర్ పాత్రకు కనెక్ట్ అయినంతగా ఇంతవరకూ ఏ చిత్రానికీ కనెక్ట్ అవ్వలేదు. వ్యక్తిగతంగా నాకు ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది’ అని అన్నారు రామ్ పోతినేని (Ram Pothineni). ఆయన కథానాయకుడిగా పి మహేశ్‌బాబు (Mahesh Babu) తెరకెక్కించిన చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మైత్రీ మూవీమేకర్స్ బేనర్ (Mythri Movie Makers) పై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఉపేంద్ర (Uppendra) కీలక పాత్రలో నటించారు.
ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం కన్నడ ట్రైలర్‌ను కర్ణాటకలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్ పోతినేని మాట్లాడుతూ ‘సినిమా, అభిమానుల విషయంలో ఎప్పటినుంచో నా మనసులో ఉన్న ఆలోచనలకి ప్రతిరూపమే ఈ చిత్రం ఇది అభిమానుల సినిమా’ అని అన్నారు. ఉపేంద్ర మాట్లాడుతూ.. ఇది ప్రతి ఒక్క సినిమా ఫ్యాన్ కోసం తీసిన సినిమా అని వారి లైఫ్‌ను సినిమాలో అద్భుతంగా చూయించారని, నేను ఈ చిత్రానికి ఫ్యాన్ అయిపోయా అని అన్నారు.
అనంతరం దర్శకుడు పి. మహేశ్‌బాబు మాట్లాడుతూ.. ‘రామ్ కెరీర్‌లోనే గర్వకారణంగా మిగిలిపోయే చిత్రమిది.’ అని అన్నారు. ‘విభిన్నమైన కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని చేశామని, చాలా కాలం మాట్లాడుకునేలా సినిమా ఉంటుందని అన్నారు. తెలుగు పేరుతోనే ఇక్కడ కూడా సినిమాను రిలీజ్ చేస్తున్నందుకు క్షమిచాలని వై.రవిశంకర్ తెలిపారు