Upasana Konidela: అఖిల్ పెళ్లి.. అద్భుతమైన ఫోటో షేర్ చేసిన ఉపాసన
ABN, Publish Date - Jun 09 , 2025 | 05:56 PM
అక్కినేని ఇంట పెళ్లి సందడి పూర్తయ్యింది. అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) చిన్న కొడుకు అఖిల్(Akhil) వివాహాం.. జైనబ్(Zainab) తో జూన్ 6 న ఎంతో సింపుల్ గా జరిగింది.
Upasana Konidela: అక్కినేని ఇంట పెళ్లి సందడి పూర్తయ్యింది. అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) చిన్న కొడుకు అఖిల్(Akhil) వివాహాం.. జైనబ్(Zainab) తో జూన్ 6 న ఎంతో సింపుల్ గా జరిగింది. పెద్ద కొడుకు నాగ చైతన్య(Naga Chaitanya) పెళ్లి కన్నా చాలా సింపుల్ గా అఖిల్ పెళ్లిని జరిపించాడు నాగార్జున. ఇక జూన్ 8 న వీరి రిసెప్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది.
టాలీవుడ్ లోని సెలబ్రిటీలు అందరూ కాకపోయినా కొంతమంది అక్కినేని వారి పెళ్లికి హాజరయ్యారు. అయితే అఖిల్ పెళ్లి ఇంత సింపుల్ గా జరగడానికి కారణం ఏంటి అనేది మాత్రం ఎవరికీ తెలియదు. అఖిల్ కి ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సీనియర్ హీరోలందరూ నాగ్ కు పరిచయమే. కానీ, వారెవరూ అఖిల్ రిసెప్షన్ లో సందడి చేయలేదు.
ఇక అఖిల్ చై తరువాత అన్నలాంటి రామ్ చరణ్(Ram Charan) మాత్రం అటు పెళ్లి .. ఇటు రిసెప్షన్ లో సతీసమేతంగా మెరిశాడు. చిన్నతనం నుంచి చరణ్ ను తన సొంత అన్నయ్యలా చూస్తాను అని అఖిల్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. తాజాగా అఖిల్ పెళ్ళిలో అక్కినేని కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను ఉపాసన(Upasana Konidela) సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపింది. అఖిల్ - జైనబ్ ఎల్లప్పుడూ ప్రేమతో కలిసి ఉండాలని కోరుతూ గాడ్ బ్లెస్స్ ఎమోజిస్ ను షేర్ చేసింది.
అఖిల్ పెళ్ళికి చరణ్ తో పాటు చిరంజీవి(Chiranjeevi) కూడా విచ్చేశారు. పెళ్లికి రావడంతో చిరు రిసెప్షన్ లో కనిపించలేదు. చరణ్ - ఉపాసన మాత్రం పెళ్లి, రిసెప్షన్ లో కనిపించి కనువిందు చేశారు. ఇక ఈ ఫోటోలలో చరణ్ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా కనిపించాడు. గుబురు గడ్డం, జుట్టుతో స్టైలిష్ గా కనిపించాడు. ప్రస్తుతం చరణ్ పెద్ది సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని లుక్ లోనే చరణ్ అఖిల్ పెళ్లిలో మెరిశాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పెద్ది సినిమా తెరకెక్కుతుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.