Unni Mukundan: యాక్షన్ థ్రిల్లర్
ABN, Publish Date - Jul 23 , 2025 | 02:59 AM
మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా జోషీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ ప్రారంభం కాబోతోంది. మంగళవారం జోషి పుట్టినరోజు సందర్భంగా...
మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా జోషీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ ప్రారంభం కాబోతోంది. మంగళవారం జోషి పుట్టినరోజు సందర్భంగా ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్, ఐన్‌స్టీన్ మీడియా సంస్థలు ఈ కొత్త ప్రాజెక్టుని అనౌన్స్ చేశాయి. జాతీయ అవార్డు గెలుచుకున్న ‘మెప్పడియాన్’ తర్వాత వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దూసుకెళ్లిన ‘మార్కో’ వంటి సినిమా నిర్మించిన ‘యూఎంఎఫ్’ సంస్థ ఇప్పుడు జోషి లాంటి మాస్టర్ డైరెక్టర్‌తో చేతులు కలిపింది. దీంతో నిర్మాణానికి ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హీరో ఉన్ని ముకుందన్ సరికొత్త లుక్‌లో, మాస్ యాక్షన్ అవతారంలో కనిపిస్తారని చిత్రబృందం పేర్కొంది.