సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Maa Vande: ఉన్ని ముకుందన్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్

ABN, Publish Date - Sep 22 , 2025 | 05:00 PM

భారత  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కథతో 'మా వందే' (Maa Vande) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి.ఎం.

భారత  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కథతో 'మా వందే' (Maa Vande) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి.ఎం. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రాంతికుమార్.సీహెచ్. సోమవారం ఉన్ని ముకుందన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. (Modi Biopic)

తన నటనా ప్రతిభతో ప్రధాని మోదీ పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారని మేకర్స్ చెప్పారు. ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలన్నీ ఎంతో సహజంగా మా సినిమాలో చూపించబోతున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్న సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్ తో రూపొందే  'మా వందే' చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ రూపొందుతోందని దర్శకుడు చెప్పారు. 

Updated Date - Sep 22 , 2025 | 05:00 PM