సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiru - Udit Narayan: మన ఎలివేషన్‌ కంటే ఉదిత్‌ ఎమోషన్‌ స్ట్రాంగ్‌ అయ్యా..

ABN, Publish Date - Oct 02 , 2025 | 04:12 PM

రామ్మా చిలకమ్మా.. (చూడాలనివుంది) కైకలూరి కన్నేపిల్లా.. (స్నేహం కోసం) గుసగుసలే గున్నామావిళ్లో (అన్నయ్య) రాధే గోవిందా (ఇంద్ర) పాటలు వింటే చిరంజీవి,  సింగర్‌ ఉదిత్‌ నారాయణ్‌ కాంబినేషన్‌ గుర్తురాకమానదు.

రామ్మా చిలకమ్మా.. (చూడాలనివుంది)


కైకలూరి కన్నేపిల్లా.. (స్నేహం కోసం)


గుసగుసలే గున్నామావిళ్లో (అన్నయ్య)


రాధే గోవిందా (ఇంద్ర) పాటలు వింటే..

చిరంజీవి,  సింగర్‌ ఉదిత్‌ నారాయణ్‌ కాంబినేషన్‌ గుర్తురాకమానదు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి పాట సూపర్‌హిట్టే. చిరంజీవి కోసం ఉదిత్‌ సాంగ్‌ పాడి చాలాకాలమైంది. కొంతగ్యాప్‌ తర్వాత ఉదిత్‌ నారాయణ్‌ చిరు కోసం పాట పాడబోతున్నారు. ప్రస్తుతం చిరు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘మన శంకర్‌వరప్రసాద్‌గారు’ చిత్రం కోసం భీమ్స్‌ సంగీత సారథ్యంలో ఉదిత్‌ ఓ పాట పాడనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

సంక్రాంతికి సూపర్‌హిట్టైన 'సంక్రాంతికి వస్తున్నాం’ కోసం రమణ గోగులను తీసుకొచ్చారు అనిల్‌ రావిపూడి. ఇప్పుడు చిరు కోసం ఉదిత్‌ను దింపారు.  ఆయన ప్రమోషన్‌ స్ట్రాటజీ  ఏ లెవల్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఉదిత్‌తో చిరంజీవి కోసం పాట పడిస్తునట్లు ప్రకటిస్తూ ఓ వీడియో చేసి బయటకు వదిలారు. అది నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతుంది.

'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంలో రమణ గోగుల కమ్ బ్యాక్ సాంగ్ గోదారి గట్టుమీద రామచిలకవే’ ఎంత పాపురల్‌ అయిందో తెలిసిందే. ఇప్పుడీ సినిమా కోసం ఉదిత్‌ నారాయణ్‌ పాడే పాట ఛార్ట్‌బస్టర్‌లో నిలుస్తుందని టీమ్‌తోపాటు సంగీత ప్రియులు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. ఇందులో  'మీసాల పిల్ల' అంటూ సాగే పాటను ఉదిత్‌ పాడారు.

దసరా సందర్భంగా ఫస్ట్‌ సింగిల్‌గా ఈ పాట ప్రోమోను గురువారం సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటిస్తున్నారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Oct 02 , 2025 | 08:16 PM