సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Udaya Bhanu: ఆ చెక్కులతో ఇంటికి తోరణాలు కట్టుకోవచ్చు..

ABN, Publish Date - Aug 16 , 2025 | 09:44 PM

ఒకప్పుడు ఉదయభాను (Udaya Bahnu) స్టార్‌ యాంకర్‌. ఏ టీవీ చూసినా, ఏ షోలో అయితే ఆమె వ్యాఖ్యాత. అయితే ఆమె యాంకరింగ్‌ చేసిన ఎన్నో కార్యక్రమాలకు నిర్వాహకులు పారితోషికం ఎగ్గొటారని ఆమె తెలిపారు.

ఒకప్పుడు ఉదయభాను (Udaya Bahnu) స్టార్‌ యాంకర్‌. ఏ టీవీ చూసినా, ఏ షోలో అయితే ఆమె వ్యాఖ్యాత. అయితే ఆమె యాంకరింగ్‌ చేసిన ఎన్నో కార్యక్రమాలకు నిర్వాహకులు పారితోషికం ఎగ్గొటారని ఆమె తెలిపారు. తన కష్టానికి తగ్గ ప్రతిఫలం అడిగితే తనపై దుష్ప్రచారం చేశారని ఆమె అన్నారు. తాజాగా ఆమె నటించిన చిత్రం  ‘త్రిబాణధారి బార్బరిక్‌’. సత్యరాజ్‌తో కీలక పాత్ర పోషించారు. మోహన్‌ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నె? 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో సత్యరాజ్‌తో కలిసి ఉదయభాను పాల్గొన్నారు.

ఆమె మాట్లాడుతూ గతంలో తను యాంకర్‌గా చేసినప్పటి విషయాలు, పేమెంట్స్‌ గురించి మాట్లాడారు. పలు షోలకు యాంకర్‌గా చేసిన చెక్‌లు బౌన్స్‌  ఇప్పటికీ అవి తన దగ్గరే ఉన్నాయని తెలిపారు. వాటితో ఇంటికి తోరణాలు కట్టవచ్చని సరదాగా వ్యాఖ్యానించారు. కాస్త గట్టిగా డబ్బులు అడిగితే, ‘ఉదయభాను పీడించి గోల చేస్తుంది’ అంటూ ప్రచారం చేసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టెలివిజన్‌ షోల కన్నా కూడా ఈవెంట్స్‌కు వెళ్లినప్పుడే కరెక్ట్‌గా డబ్బులు వచ్చేవన్నారు.అవే జీవితంలో తనని నిలబెట్టాయని అన్నారు.

విలన్‌గా ట్రెండ్‌ సెట్‌ చేశా: సత్యరాజ్‌ (Satyaraj)
సినిమా కథ, బడ్జెట్‌ను బట్టి తన రెమ్యునరేషన్‌ ఉంటుందని సత్యరాజ్‌ అన్నారు. ‘సినిమా ఫీల్డ్‌కు వచ్చి 47 ఏళ్లు అయింది. తొలినాళ్లలో విలన్‌గా 75 సినిమాలు చేశా. 100కు పైగా చిత్రాల్లో హీరోగానూ చేశా. వాటిలో పారితోషికాలు వదులుకున్న సినిమాలు చాలనే ఉన్నాయి. ముఖ్యంగా హీరోగా చేసినప్పుడు ఆ సినిమాల విడుదల కోసం అప్పులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నేను క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తున్నా. రెమ్యునరేషన్‌ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గాలి? అయితే, ప్రాజెక్ట్‌ మొదలవ్వక ముందే చర్చిస్తే పారితోషికం తక్కువైనా ఫర్వాలేదు. అలాగే, సినిమా బడ్జెట్‌, నా పాత్ర నిడివిని బట్టి కూడా రెమ్యునరేషన్‌ ఉంటుంది. అప్పుడు ‘బాహుబలి’కి ఇప్పుడు ‘బార్బరిక్‌’కి ఒకే పారితోషికం తీసుకోలేను కదా. నేను విలన్‌గా ఒక ట్రెండ్‌ సెట్‌ చేశా. నేనేమైనా చెబితే అప్పుడు హీరో, దర్శకుడు ఇద్దరూ ఒప్పుకొనేవారు. ఇప్పుడు నా ముందు ఓకే అంటారు. ఆ తర్వాత గుసగుసలాడతారు. నటించడం కన్నా దర్శకత్వం చేయడం చాలా కష్టం’ అని అన్నారు.

 

Updated Date - Aug 16 , 2025 | 10:04 PM