Trivikram- Venkatesh: వెంకీమామ సరసన ఆ ఇద్దరు భామలు..?
ABN , Publish Date - Jul 05 , 2025 | 07:18 PM
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు విక్టరీ వెంకటేష్ (Venkatesh). ఈ సినిమా వెంకీమామను మొదటిసారి వంద కోట్ల క్లబ్ లో చేర్చడమే కాకుండా సంక్రాంతి విన్నర్ గా నిలబెట్టింది.
Trivikram- Venkatesh: సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు విక్టరీ వెంకటేష్ (Venkatesh). ఈ సినిమా వెంకీమామను మొదటిసారి వంద కోట్ల క్లబ్ లో చేర్చడమే కాకుండా సంక్రాంతి విన్నర్ గా నిలబెట్టింది. ఇక ఈ చిత్రంతో మరింత జోరు పెంచిన వెంకీ మామ.. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి త్రివిక్రమ్ (Trivikram) సినిమా. పుష్ప 2 (Pushpa 2) తరువాత బన్నీ - త్రివిక్రమ్ సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ, బన్నీ.. గురూజీకి హ్యాండ్ ఇచ్చి అట్లీ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. బన్నీ ఇప్పుడప్పుడే తిరిగి వెనక్కి రాడు కాబట్టి ఈలోపు వెంకటేష్ తో ఒక సినిమా చేయబోతున్నాడు త్రివిక్రమ్.
గురూజీ- వెంకీ ఈ కాంబోకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు త్రివిక్రమ్ నే మాటల రచయిత. ఆ తరువాత వీరిద్దరి కాంబోలో మల్లీశ్వరి వచ్చింది. ఈ రెండు సినిమాలో వెంకీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా కామెడీకి అయితే ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు అంటే అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబో రీపీట్ కానుంది అంటే ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న గురూజీ ఇంకోపక్క వెంకీ సరసన రొమాన్స్ చేసే బ్యూటీస్ వెతుకుతున్నాడని తెలుస్తోంది. మొదటి నుంచి కూడా త్రివిక్రమ్ సినిమా అంటే ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే. మళ్లీ సెకండ్ హీరోయిన్ ఏమైనా యావరేజ్ గా ఉండే అమ్మాయిని తీసుకుంటాడా.. ? అంటే కొన్ని సినిమాల్లో మెయిన్ హీరోయిన్ కన్నా సెకండ్ హీరోయినే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇక ఈ ఇద్దరు హీరోయిన్ల ఫాంటసీని వెంకీ సినిమాలో కూడా ఫాలో అవుతున్నాడట గురూజీ. ఈసారి వెంకీ మామ.. ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడు. అంటే సంక్రాంతికి వస్తున్నాంలో కూడా వెంకీ అదే పని చేసాడనుకోండి.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం .. ఈ సినిమాలో వెంకీ సరసన త్రిష, నిధి అగర్వాల్ ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. వెంకీ- త్రిషది హిట్ కాంబో. ఆడవారి మాటలకు అర్దాలే వేరులే, బాడీగార్డ్, నమో వేంకటేశ లాంటి సినిమాలు చేశారు. ఈ పెయిర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. మెయిన్ హీరోయిన్ గా త్రిష అయితే బావుంటుందని గురూజీ అభిప్రాయపడి ఆమెను కలవడం, వెంటనే ఆమె ఓకే చెప్పడం జరిగిందని సమాచారం. ఇక రెండో బ్యూటీగా హాట్ భామ నిధి అగర్వాల్ ను అనుకున్నారట. ఆమె కూడా ఓకే చెప్పిందని సమాచారం.
ఇప్పటికే ఈ సినిమాకు వెంకట రమణ కేరాఫ్ ఆనంద నిలయం అనే టైటిల్ ను అనుకుంటున్నారని టాక్. నువ్వు నాకు నచ్చావ్ తరహాలోనే ఈ సినిమా కూడా ఉండబోతుందని చెప్పుకొస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతో గురూజీ - వెంకీ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
Rashmika Mandanna: మరో వివాదంలో రష్మిక.. కన్నెర్ర చేసిన కన్నడిగులు