సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Trump: ట్రంప్‌ నిర్ణయం.. అమెరికాలో తెలుగు సినిమాలకు పెద్ద షాక్‌

ABN, Publish Date - Sep 29 , 2025 | 07:47 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (trump shocking decision) ఇండియన్స్‌కు చుక్కలు చూపే ప్రయత్నం చేస్తున్నారు. అనుక్షణం భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (trump shocking decision) ఇండియన్స్‌కు చుక్కలు చూపే ప్రయత్నం చేస్తున్నారు. అనుక్షణం భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. భారతీయ వస్తువులపై సుంకాల పేరుతో నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సినిమాలు(Tollywood), షూటింగ్‌లపై పడి ‘సినిమా చూపిస్త మావ’ అంటున్నారు. తాజా ప్రకటనలో ఇండియన్‌ సినిమాలకు బిగ్‌ షాక్‌ ఇచ్చారు ట్రంప్‌. విదేశీ సినిమాలపై ట్రంప్‌ వంద శాతం సుంకాలు విధించడానికి సిద్ధపడ్డారు. అయితే అమెరికాలో నిర్మించే చిత్రాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. దీంతో తెలుగు సినిమాపై ట్రంప్‌ టాక్స్‌ ఎఫెక్ట్‌ భారీగా పడనుంది.

అమెరికాలో విడుదల చేసే విదేశీ సినిమాలపై ఇక నుంచి వంద శాతం ట్యాక్స్‌ విధించనున్నారు. దీనిని బట్టి చూస్తే.. తెలుగు సినిమా, షూటింగ్‌లపై ట్రంప్‌ టాక్స్‌ ఎఫెక్ట్‌ బాగా పడనుంది. ఎందుకంటే ఇతర భారతీయ భాషా చిత్రాలతో పోల్చితే తెలుగు సినిమాకు అమెరికాలో క్రేజ్‌, మార్కెట్‌ ఎక్కువ. అలాగే తెలుగు చిత్రాల చిత్రీకరణలు కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎక్కువగా చేస్తుంటారు. ఇప్పుడీ ఎఫెక్ట్‌ తెలుగు సినిమాలపై బాగా పడనుంది.



ఈ మేరకు ట్రంప్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘మన సినిమా వ్యాపారం అమెరికా నుండి ఇతర దేశాలు దోచుకున్నాయి. ఇది చిన్నపిల్లాడి దగ్గర చాక్లెట్‌ దొంగిలించినట్లు అనేలా ఉంది. గవర్నర్‌ అసమర్ధత వల్ల కాలిఫోర్నియా బలహీనంగా మారింది. ఎక్కువగా  నష్టపోయింది. ఇది చాలా కాలంగా ఎప్పటికీ పరిష్కారం లేని సమస్యగా ఉండిపోయింది.  అందుకే అమెరికా సంయుక్త రాష్ట్రాల బయట తయారైన ఉత్పత్తులు, సినిమాలపై వంద శాతం సుంకం విధించబోతున్నాను. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మార్చుదాం’ అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు  అయితే ఈ సుంకాలు ఎప్పటి నుంచి వర్తించేదీ మాత్రం వెల్లడించలేదు.
 

Updated Date - Sep 29 , 2025 | 07:56 PM