Trisha: మహేష్ బాబులా ఉండాలని చాలా ట్రై చేశా

ABN , Publish Date - Jun 24 , 2025 | 08:19 PM

ఇప్పుడంటే త్రిష (Trisha) తెలుగులో అంతగా కనిపించడం లేదు కానీ, ఒకప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది.

Trisha

Trisha: ఇప్పుడంటే త్రిష (Trisha) తెలుగులో అంతగా కనిపించడం లేదు కానీ, ఒకప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. వర్షం, అతడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, సైనికుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రతి సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకొని టాలెంటడ్ నటి అని అనిపించుకుంది. కొత్త కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో తమిళ్ కి వెళ్లి అక్కడ సెటిల్ అయిన త్రిష చాలా గ్యాప్ తరువాత చిరంజీవి పక్కన విశ్వంభర సినిమాలో కనిపించనుంది. ఇప్పటికే చిరు - త్రిష కాంబోలో స్టాలిన్ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.


ప్రస్తుతం తమిళ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉన్న త్రిష.. ఈమధ్య విజయ్ తో రిలేషన్ వార్తలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే తాజాగా త్రిష ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చింది. వీరిద్దరూ కలిసి అతడు , సైనికుడు నటించారు. ఆ సమయంలో మహేష్ లా ఉండాలని ఆమె ఎంతో ప్రయత్నించిందట. కానీ, అలా ఉండలేకపోయిందని చెప్పుకొచ్చింది.


' మహేష్ బాబుతో నేను రెండు సినిమాలు చేశాను. ఆయన ఉదయం 6 గంటలకల్లా సెట్ లో ఉంటారు. సీన్ అవ్వగానే కార్ వాన్ లోకి వెళ్లిపోకుండా మిగతావారు కూడా ఎలా నటిస్తున్నారు అనేది చూస్తారు. మానిటర్ వద్ద అందరినీ చూస్తూ వారిని అబ్జర్వ్ చేస్తారు. తన సీన్ వచ్చినప్పుడు మానిటర్ దగ్గరకు వచ్చి చూడొచ్చు. కానీ, ఆయన నటీనటులందరూ ఎలాంటి హావభావాలను ఇస్తున్నారు అనేది గమనిస్తారు. అంతేనా ఉదయం వచ్చిన దగ్గరనుంచి నైట్ వెళ్లెవరకూ అదే యాక్టివ్ నెస్ తో కనిపిస్తారు.


నేను ఆయనలా ఉండాలని చాలాసార్లు ప్రయత్నించాను. ఉదయం 6 గంటలకల్లా సెట్ లో ఉండాలని, ఇంకా మహేష్ కన్నా ముందే సెట్ లో కనిపించాలని ట్రై చేశా. కానీ అది నావల్ల కాలేదు. ఆయనలా అంత ఉదయమే వచ్చే టైమ్ నాకు ఉండేది కాదు. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా మహేష్ కన్నా ముందు రాలేకపోయేదాన్ని. మహేష్ చాలా మంచి వ్యక్తి. మానిటర్ లో చూసుకొని తనను తానే జడ్జ్ చేసుకునేవాడు' అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Havish: నేను రెడీ అంటున్న హవీష్

Updated Date - Jun 24 , 2025 | 08:19 PM