Havish: నేను రెడీ అంటున్న హవీష్

ABN , Publish Date - Jun 24 , 2025 | 07:14 PM

కుర్ర హీరో హావీష్ (Havish) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Havish

Havish: కుర్ర హీరో హావీష్ (Havish) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిజినెస్ కుటుంబం నుంచి వచ్చిన హావీష్ సినిమాలపై మక్కువతో నువ్విలా సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు. రవిబాబు (Ravibabu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక దీని తరువాత యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో జీనియస్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా.. ఈ సినిమాలోని సాంగ్స్ మాత్రం ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి.


జీనియస్ తరువాత రామ్ లీల, సెవెన్ సినిమాలతో మెప్పించిన హవీష్ నిర్మాతగా కూడా మరి రెండు సినిమాలను నిర్మించాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన రాక్షసుడు సినిమాను హవీష్ నే నిర్మించాడు. ఈ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. ఇక దీని తరువాత రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ సినిమాను నిర్మించాడు. కానీ, ఇది భారీ పరాజయాన్ని అందుకుంది.

1.jpg


ఇక సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన హవీష్.. తాజాగా యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో ప్రయోగాత్మక చిత్రాలు కాకుండా.. కుటుంబ, వినోదాత్మక, ప్రేమ కథతో కూడిన మంచి సినిమా చేయాలన్న సంకల్పంతో నేను రెడీ అంటూ వస్తున్నాడు. హవీష్ హీరోగా సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్నచిత్రం నేను రెడీ. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. నేడు హవీష్ పుట్టినరోజు కావడంతో.. చిత్రబృందం ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.

Ajith: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో

Updated Date - Jun 24 , 2025 | 09:01 PM