సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Trisha Krishnan: విజయ్ తో పెళ్లి రూమర్స్.. అసహ్యమేస్తుందన్న త్రిష

ABN, Publish Date - Nov 17 , 2025 | 03:34 PM

ఇండస్ట్రీలో రూమర్స్ ఎలా ఉంటాయో అందరికీ తెల్సిందే. ముఖ్యంగా హీరో - హీరోయిన్ కలిసి కనిపిస్తే చాలు వారిమధ్య ఏదో ఉందని పుకార్లు పుట్టుకొచ్చేస్తాయి.

Trisha

Trisha Krishnan: ఇండస్ట్రీలో రూమర్స్ ఎలా ఉంటాయో అందరికీ తెల్సిందే. ముఖ్యంగా హీరో - హీరోయిన్ కలిసి కనిపిస్తే చాలు వారిమధ్య ఏదో ఉందని పుకార్లు పుట్టుకొచ్చేస్తాయి. అదే వారిద్దరూ నాలుగైదు సార్లు కనిపిస్తే అంతే.. ఇద్దరికీ పెళ్లి అంటూ రాసుకొచ్చేస్తారు. కోలీవుడ్ హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan).. హీరో విజయ్ (Vijay) ల మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు వెళ్లిందన్న వార్త మీడియా మొత్తం హాట్ టాపిక్ గా మారిన విషయం తెల్సిందే. అందుకు కారణం కూడా లేకపోలేదు.

విజయ్ తో ఉన్న అద్భుతమైన క్షణాలను ఎప్పటికప్పుడు త్రిష తన సోషల్ మీడియాలో పోస్టు చేయడం.. వారిద్దరి మీద వస్తున్న రూమర్స్ ను ఖండించకపోవడంతో నిజమే అనే చెప్పుకొస్తున్నారు. విజయ్ తో ప్రేమ కేవలం రాజకీయాల కోసమే అని, త్రిష త్వరలోనే విజయ్ పార్టీలో చేరనుందని కూడా వార్తలు వచ్చాయి. ఇక ఈ పుకార్లపై త్రిష ఎప్పుడు సీరియస్ గా తీసుకోదు. కానీ, ఈసారి మాత్రం అమ్మడు సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఎంతమందితో నా పెళ్లి చేస్తారు అంటూ మండిపడింది.

తాజాగా త్రిష తన పెళ్లి, రాజకీయాలు గురించి వస్తున్న వార్తలపై స్పందించింది. ' నా పెళ్లి, పొలిటికల్ ఎంట్రీ అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఒక వ్యక్తితో కలిసి ఫోటోలు దిగితే మా ఇద్దరికీ పెళ్లి చేస్తారా.. ? ఫ్రెండ్స్ తో ఫోటోలు దిగకూడదా.. ? ఎంతమంది తో నా పెళ్లి చేస్తారు. ఇలాంటి వార్తలు చూస్తుంటే అసహ్యమేస్తుంది. ఇలాంటి ఆధారాలు లేని పుకార్లు పుట్టించడం ఆపండి' అంటూ చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడైనా ఈ వార్తలు ఆగుతాయేమో చూడాలి.

Updated Date - Nov 17 , 2025 | 03:34 PM