OG Trance Of OMI: ట్రాన్స్ ఆఫ్.. ఓమీ వచ్చేసింది
ABN, Publish Date - Sep 11 , 2025 | 06:42 PM
హరిహరవీరమల్లు తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నుంచి వస్తున్న చిత్రం ఓజీ (OG).
హరిహరవీరమల్లు తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నుంచి వస్తున్న చిత్రం ఓజీ (OG). సినిమా విడుదలకు ఇంకా పది రోజులుండగానే ఇప్పటికే ఆకాశాన్నంటే అంచనాలతో ఓవర్సీస్‌లో అడ్వాన్స్ కలెక్షన్ల రికార్డుల మోత మోగిస్తోంది. సినిమా విడుదల ఇంకా కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో ఈ చిత్రంకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లోనే సోషల్ మీడియా షేక్ అవుతోంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలు, గ్లింప్స్ వీడియోలు సంచలనం సృష్టించగా తాజాగా ట్రాన్స్ ఆఫ్ ఓమీ ట్రిప్పింగ్ ఆన్ అంటూ విలన్ పాత్రధారి ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్ నేపథ్యంగా ఆయన హుందాతనాన్ని వర్ణిస్తూ వచ్చే మ్యూజికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
2 నిమిషాల 53 సెకన్లు ఆ పాట ఆద్యంతం ఇన్స్ట్రూమెంట్ ప్రధానంగా సాగింది. ఈ పాటకు అద్వితీయ (Adviteeya) సాహిత్యం అందించగా హర్ష ఆలపించాడు. ఇప్పుడు ఈ పాట, విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి.