Kannappa: విమాన ప్రమాదం.. కన్నప్ప టీమ్ షాకింగ్ నిర్ణయం!

ABN , Publish Date - Jun 12 , 2025 | 04:12 PM

మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కన్నప్ప(Kannappa).

Kannappa

Kannappa: మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కన్నప్ప(Kannappa). మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోస్ అయిన ప్రభాస్(Prabhas), మోహన్ లాల్, అక్షయ్ కుమార్ క్యామియో పాత్రల్లో నటిస్తుండగా.. ప్రీతీ ముకుందన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 

జూన్  27 న కన్నప్ప ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన విష్ణు.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తూవస్తున్నాడు . ఇక జూన్ 13 న  కన్నప్ప ప్రీ రిలీజ్  ఈవెంట్ ను ఇండోర్ లో ప్లాన్ చేసిన విషయం తెల్సిందే.  ఈ వేడుకలోనే  కన్నప్ప ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే నేడు అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశం మొత్తాన్ని కుదిపేసింది.

 

Rana Daggubati: వెంకటేశ్ ‌‌ని బూతులు తిట్టడంపై స్పందించిన రానా!

 అహ్మదాబాద్ నుంచి  లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దీ సెకన్స్ లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులతో సహా మొత్తం 242 మంది మృతిచెందినట్లు సమాచారం. ఈ ప్రమాదంతో ఇండియా మొత్తం విషాదంతో నిండిపోయింది. ఈ విషాద సమయంలో తమ కన్నప్ప ట్రైలర్ ను రిలీజ్ చేయలేమని మంచి విష్ణు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలిపాడు. విమాన ప్రమాదంలో మృతిచెందినవారికి సంతాపం ప్రకటిస్తూ పోస్ట్ పెట్టాడు.

 

 " ఈరోజు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని తెలిసి నా గుండె పగిలిపోయింది. తీవ్ర దుఃఖంలో, కనప్ప ట్రైలర్ విడుదలను ఒక రోజు వాయిదా వేస్తున్నాము.  అంతేకాకుండా రేపు జరగబోయే  ఇండోర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నాము. ఈ ఊహించలేని క్లిష్ట సమయంలో ఆ కుటుంబాలు ధైర్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను" అంటూ తెలిపాడు. 

Updated Date - Jun 12 , 2025 | 04:12 PM