Rana Daggubati: వెంకటేశ్ ని బూతులు తిట్టడంపై స్పందించిన రానా!
ABN , Publish Date - Jun 12 , 2025 | 03:45 PM
విక్టరీ వెంకటేశ్(Venkatesh), రానా దగ్గుబాటి(Rana Daggubati) నటించిన రానా నాయుడు(Rana Naidu) వెబ్ సిరీస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Rana Daggubati: విక్టరీ వెంకటేశ్(Venkatesh), రానా దగ్గుబాటి(Rana Daggubati) నటించిన రానా నాయుడు(Rana Naidu) వెబ్ సిరీస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్ ఫ్లిక్స్(Netflix) ఒరిజినల్ సిరీస్ గా రానా నాయుడును సుప్రన్ వర్మ. కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించారు. 2023 లో ఈ సిరీస్ ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యి భారీ విమర్శలను అందుకుంది. ఇప్పటివరకు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న వెంకటేశ్ మొదటిసారి తన పంథా మార్చుకొని ఇలాంటి సిరీస్ లో నటించాడు. ఇక ఇందులో ఎక్కువ వల్గారిటీ, బూతు సంభాషణలు ఉండడంతో ప్రేక్షకులు వెంకీ మామను విమర్శించారు. కొద్దిగా ఛేంజ్ కోసం వెంకీ ఇలాంటి సిరీస్ ను చేస్తే అదే ఆయన జీవితంలో చేసిన పెద్ద పొరపాటు అనే విధంగా చేశారు.
ఇక ఇప్పుడు రానా నాయుడు సీజన్ 2 రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఈసారి మాత్రం బూతు సంభాషణలకు, ఇంటిమేటెడ్ సీన్స్ ను తొలగించినట్టు తెలుస్తోంది. జూన్ 13 నుంచి రానా నాయుడు సీజన్ 2 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ కోసం రానా ముంబైలో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ హైప్ పెంచుతున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రానా.. సీజన్ 1 లో బాబాయ్ అయిన వెంకటేశ్ ని బూతులు తిట్టడంపై స్పందించాడు. డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడినట్లు తెలిపాడు.
Sreeleela: చిన్నారి శ్రీలీలకు ఘనంగా ఆహ్వానం పలికిన ఉస్తాద్ టీమ్
" హిందీలో నాకు కొన్ని పాదాలకు అర్ధం తెలియదు. సీజన్ 1 కి హిందీ డబ్బింగ్ చెప్పేటప్పుడుఅక్కడ ఏవైతే డైలాగ్స్ ఉన్నాయో వాటిని అలాగే చెప్పేసాను. అప్పుడు డైలాగ్స్ చెప్తున్నాను అనుకున్నాను.. బాబాయ్ ను తిడుతున్నాను అనుకోలేదు. అయితే తెలుగులో డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆ పదాలకు అర్ధం తెలిసింది.అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ఈ డైలాగ్స్ ఎలా చెప్పాలి అని ఆలోచించాను. నటీనటులుగా ఒక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఎలాంటి డైలాగ్స్ అయినా.. ఎవరు ఉన్నా చెప్పక తప్పదు అని అర్ధం చేసుకున్నాను.
నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బాబాయ్ తో కలిసి పనిచేయాలని కోరుకొనేవాడిని. రానా నాయుడుతో ఆ కల నెరవేరింది. ఒక నటుడిగా బాబాయ్ దగ్గర ఎంతో నేర్చుకున్నాను. ఆయనే నాకు స్ఫూర్తి. ఈ సిరీస్ లో నా పేరు రైనా. కానీ బాబాయ్ నన్ను రానా రానా అని పిలిచేవాడు. ఈ సిరీస్ ను మా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసాం." అని చెప్పుకొచ్చాడు. మరి సీజన్ 1 తో విమర్శల పాలైన వెంకీ సీజన్ 2 తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.