Komatireddy Venkat Reddy: షూటింగ్స్ ఆపేయడం కరెక్ట్ కాదు.. రేపటితో ఇష్యూ క్లోజ్ అవ్వాలి..
ABN, Publish Date - Aug 11 , 2025 | 10:16 PM
టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ (tollywood) ప్రతినిధులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో (komatireddy Venkat reddy) సమావేశమయ్యారు.
టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ (tollywood) ప్రతినిధులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో (komatireddy Venkat reddy) సమావేశమయ్యారు. చిత్ర పరిశ్రమలో సమస్యల గురించి ఆయన తెలుసుకున్నారు. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వేతనాలు పెంపును కార్మికులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే! నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు (FDC chairman Dil raju) మంత్రితో భేటీ అయ్యారు. టాలీవుడ్ నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించారు. నిర్మాతలు సుప్రియ, జెమిని కిరణ్, దామోదర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ ‘పని చేస్తూనే డిమాండ్స్ నెరవేర్చుకోవాలని, షూటింగ్స్ ఆపేయడం కరెక్ట్ కాదని అన్నారు. పట్టువిడుపుతో ఉండాలని నిర్మాతలకు, ఫెడరేషన్ ప్రతినిధులకు సూచించారు. ఒకరి ఇబ్బందులను మరొకరు అర్థం చేసుకోవాలని, సమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులు కూర్చొని మంగళవారం మరోసారి చర్చించుకోవాల,ని తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని దిల్ రాజుకు సూచించారు. మంగళవారం జరిగే మీటింగ్ ఈ గొడవకు ఫుల్‌స్టాప్ పెట్టాలని, ఆ మీటింగ్‌కు తానూ హాజరవుతానని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. విడతలవారీగా వేతనాల పెంపనుకు అంగీకరించండి. సమ్మె విరమించి ఎవరి పనులువారు చూసుకోండని, ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం సినిమా ఇండస్ర్టీ నీ పెద్దగా చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు.