సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Year Ender 2025: ఈ పాటలు దుమ్ము దులిపేశాయి 

ABN, Publish Date - Dec 25 , 2025 | 09:41 AM

మరో వారం రోజుల్లో 2025కు గుడ్‌బై చెప్పి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. సినిమాల పరంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దగా హిట్‌ మెరుపులు మెరవలేదు. అయితే ఆయా చిత్రాల్లో మ్యూజిక్‌ మాత్రం మ్యాజిక్‌ చేసింది.

Tollywood Top Songs 2025

మరో వారం రోజుల్లో 2025కు గుడ్‌బై చెప్పి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. సినిమాల పరంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దగా హిట్‌ మెరుపులు మెరవలేదు. అయితే ఆయా చిత్రాల్లో మ్యూజిక్‌ మాత్రం మ్యాజిక్‌ (music Majic) చేసింది. మ్యూజిక్‌ వరల్డ్‌ల మెరుపులు మెరిశాయి. కొన్ని పాటలైతే విపరీతంగా ట్రెండ్‌ అయ్యాయి(Tollywood Trending songs 2025). మరి కొన్ని చిత్రాల్లో పాటలైతే రీల్స్‌ రూపంలో మోత మోగించాయి. అసలు రీల్స్‌ టీమ్స్‌ కోసమే ఈ పాటలు వచ్చాయా అన్నంత ఆశ్చర్యం కలిగించాయి. అంటే అంతగా ఆ పాటలు హల్‌చల్‌ చేశాయి. అయితే ఈ పాటలన్నీ సినిమా సక్సెస్‌ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా  సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నవే! ఆ పాటల్ని ఓసారి గుర్తు చేసుకుంటే..
(2025 Viral songs)

 

ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి భారీ విజయం సాధించిన చిత్రం వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి కాంబోలో వచ్చిన  ‘సంక్రాంతికి వస్తున్నాం’. దాదాపు ఈ సినిమాలో పాటలన్నీ హిట్టే. వాటిలో ఫిల్టర్‌ చేస్తే ‘గోదారి గట్టు మీద రామసిలకవే’ (godari gattu meeda) పెద్ద హిట్‌ అయింది. ఈ పాటతో గాయకుడు, సంగీత దర్శకుడు రమణ గోగుల టాలీవుడ్‌కు కమ్‌ బ్యాక్‌ ఇచ్చారు. భీమ్స్‌ సంగీత సారథ్యంలో భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ఈ పాటతోనే సినిమాకు సగం ప్రమోషన్‌ అయిపోయిందనుకోవచ్చు. అలాగే మీను, బ్లాక్‌బస్టర్‌ సాంగ్స్‌ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి.


సంక్రాంతి బరిలో నిలిచిన మరో చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌’. ఇది అభిమానుల్ని నిరాశ పరిచినా ‘జరగండి జరగండి’ పాట మాత్రం దద్దరిల్లిపోయింది. అలాగే సంక్రాంతి బరిలో నిలిచిన డాకు మహారాజ్‌’లో ‘దబిడి దిబిడి’ సాంగ్‌ మాస్‌ను ఊపేసింది. అదే చిత్రంలో ‘నా బంగారు కూన’ మెలోడీగా నిలిచింది. ‘తండేల్‌’ సినిమాలోని ‘బుజ్జి తల్లి’ పాట మార్మోగిపోయిందనే చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యాజిక్‌ మరోసారి ఈ పాటతో తెలిసింది. ‘మిరాయ్‌’లోని ‘వైబ్‌ ఉందిలే’ పాట బాక్సులు బద్దలుకొట్టింది. సంగీత దర్శకుడు హరి గౌర మరోసారి తన సత్తా చాటాడు. ‘హరిహర వీరమల్లు’లో ‘కొల్లగొట్టినాదిరో’ పాట ప్రేక్షకుల మనసును కొల్లగొట్టేసింది.

‘రాబిన్‌ హుడ్‌’ సినిమా ఫెయిల్‌ అయినా అందులోని 'అదిదా సర్‌ ప్రైజూ' సాంగ్‌ యూత్‌ని ఆకట్టుకుంది. పాటలో కేతిక శర్మ అందం, డాన్స్‌ స్టెప్పులు మెస్మరైజ్‌ చేశాయి. ‘మ్యాడ్‌ స్వ్కేర్‌’లోని పేరు స్వాతి రెడ్డి పాట మాస్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ‘జూనియర్‌’ చిత్రంలోని వైరల్‌ వయ్యారి మంచి బీటున్న పాటగా ఆలరించింది. అందులో శ్రీలీల  స్పీడ్‌ డాన్స్‌, హోయలు కుర్రకారుని మత్తులో దించేశాయి.

చిన్న సినిమాగా మొదలై పెద్ద హిట్‌ అయిన 'కోర్ట్‌' సినిమాలోని ‘కథలెన్నో చెప్పారు’ పాట ఓ ఊపు ఊపింది. టీవీ షోలు, రీల్స్‌లో మోత మోగిపోయింది. ఈ సినిమాకు ఈ పాటే పెద్ద ప్రచారం. చిన్న సినిమాల్లో మెరిసిన పెద్ద మెరుపు ‘లిటిల్‌ హార్ట్స్‌’. ఈ సినిమాలో పాటలు కూడా బాగున్నాయి. ఇందులో ‘హల్లో అని’, 'కాత్యాయిని' పాటలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో సింజిత్‌ యర్రమిల్ల సంగీత దర్శకుడిగా నిరూపించుకున్నారు.  


ఇక ఈ ఏడాది టాలీవుడ్‌ అందుకున్న విజయవంతమైన చిత్రాల్లో ‘ఓజీ’. ఈ సినిమాలో పాటలు ఎక్కువే. అన్నీ వెస్ట్రన్‌ స్టైల్‌లో సాగాయి. ఫైర్‌ స్టామ్‌, హంగ్రీ చీతా, సువ్విసువ్వి పాటలు మార్మోగాయి. ‘తమన్‌ ఏం తాగి కొట్టాడురా బాబు’ అంటూ ప్రశంసలు కురిపించారు అభిమానులు. ఇటీవల వచ్చిన రామ్‌ ‘ఆంధ్రా కింగ్‌ తాలుకా’లో   'నువ్వుంటే చాలే..', 'చిన్ని గుండెలో' పాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ‘తెలుసు కదా’ సినిమా పరాజయం పాలైనా అందులో పాటలు ఆకట్టుకున్నాయి. సిద్ద్‌ శ్రీరామ్‌ పాడిన ‘నచ్చేసిందే’ పాట సూపర్‌ హిట్‌ అయ్యింది.

బాలయ్య నటించిన ‘అఖండ 2: తాండవం’ చిత్రంతో తమన్‌ మరోసారి తాండవం సృష్టించాడు. టైటిల్‌సాంగ్‌తోపాటు ‘జాజికాయ జాజిరే’ టాప్‌ లేపేశాయి. అఖండ2, ఓజీ చిత్రాలతో ఈ ఏడాది తమన్‌ నామ సంవత్సరంగా నిలిచిపోయింది. ‘ఛాంపియన్‌’లోని ‘గిర గిర’ అతి తక్కువ సమయంలో జనాలకు ఎక్కేసింది.

అనువాద చిత్రాల్లో పాటలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. వాటిలో బాగా మోగిన పాట ‘కూలీ’లోని ‘మోనికా’ సాంగ్‌. ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ చిత్రంలోని 'గోల్డెన్‌ స్పారో' సాంగ్‌ వైరల్‌ అయింది.

ఇక రాబోయే చిత్రాల్లో ‘పెద్ది’లోని ‘చికిరి’ పాట సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ పాట తక్కువ సమయంలోనే 100 మిలియన్‌ క్లబ్బులో చేరడం విశేషం! అలాగే ‘మన శంకర వర ప్రసాదుగారు’లోని ‘మీసాల పిల్ల్ల’ అభిమానులకే కాకుండా అందరికీ నచ్చేసింది. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ లోని ‘దేఖ్‌ లేంగే సాలా..’ ప్రస్తుతం యూట్యూబ్‌ని షేక్‌ చేస్తోంది. మరి రాబోయే ఏడాది ఇంకా ఎన్ని పాటలు అభిమానులకు పరమానందం పంచుతాయో చూడాలి.

2025లో టాప్ టెన్ టాలీవుడ్ సాంగ్స్

పలు ప్లాట్ ఫామ్స్ పై వ్యూస్ ఆధారంగా టాప్ టెన్ సాంగ్స్

నంబర్ వన్ ప్లేస్ లో 'గోదారి గట్టు మీద...'

రెండో స్థానంలో నిలచిన 'వైబుంది... బేబీ...'

మూడో ప్లేస్ దక్కించుకున్న 'బుజ్జి తల్లి...'

నాలుగో స్థానంలో నర్తించిన 'ప్రేమలో...'

ఐదో ప్లేలో సందడి చేసిన 'దబిడి దిబిడి...'

ఆరో స్థానంలో అలరించిన 'మోనికా బెల్లూచీ...'

ఏడో ప్లేస్ లో రంజింప చేసిన 'నువ్వుంటే చాలే..'

ఎనిమిదో స్థానంలో నిలచిన 'మల్లికా గంధ...'

తొమ్మిదో ప్లేస్ లో 'పోయిరా మామా...'

పదో స్థానంలో 'కొల్లగొట్టినాదిరో...'

Updated Date - Dec 25 , 2025 | 10:33 AM