సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sara Arjun: ధురంధర్ హిట్.. సారా కోసం క్యూ కడుతున్న టాలీవుడ్

ABN, Publish Date - Dec 27 , 2025 | 05:35 PM

సినీ ప్రపంచంలో అదృష్టం అనేది అందరినీ తలుపు తట్టదు. కొందరు హీరోయిన్లు పదుల సంఖ్యలో సినిమాలు చేసినా రాని గుర్తింపు.. మరికొందరికి కేవలం ఒకే ఒక్క సినిమాతో, లేదా ఒక్క చూపుతోనే వచ్చేస్తుంది.

Sara Arjun

Sara Arjun: సినీ ప్రపంచంలో అదృష్టం అనేది అందరినీ తలుపు తట్టదు. కొందరు హీరోయిన్లు పదుల సంఖ్యలో సినిమాలు చేసినా రాని గుర్తింపు.. మరికొందరికి కేవలం ఒకే ఒక్క సినిమాతో, లేదా ఒక్క చూపుతోనే వచ్చేస్తుంది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఇలాంటి అరుదైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న బ్యూటీ సారా అర్జున్ (Sara Arjun). నాన్న సినిమాలో చియాన్ విక్రమ్ (Vikram) కు కూతురుగా అమాయకపు కళ్లతో కోట్లాది మంది హృదయాలను పిండేసిన ఆ చిన్నారి సౌందర్యరాశిగా మారి వెండితెరపై ప్రకంపనలు సృష్టిస్తోంది.

బాలనటిగా కెరీర్ ప్రారంభించిన సారా.. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్‌లో నందిని చిన్నప్పటి పాత్రలో సారా చూపిన అభినయం పాన్ ఇండియా స్థాయిని ఆశ్చర్యపరిచింది. ఐశ్వర్యరాయ్ అంతటి అందగత్తెకు చిన్నప్పటి పాత్రను పోషించడమంటే సామాన్యమైన విషయం కాదు. అక్కడ మొదలైన సారా ప్రస్థానం.. ఇప్పుడు ధురందర్ సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక టాలీవుడ్‌లోనూ సారా అర్జున్ పేరు మారుమోగిపోతోంది. టాలీవుడ్ మేకర్స్ ఆమె కోసం క్యూ కడుతున్నారు. ఇప్పటి తరం హీరోయిన్లలో గ్లామర్ ఉంటే నటన ఉండదు.. నటన బాగుంటే గ్లామర్ సరిపోదు. అయితే సారా అర్జున్ విషయంలో అందం, అభినయం రెండూ సమపాళ్లలో ఉండటం విశేషం. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యుఫోరియాలో సారా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో సంబంధం లేకుండానే, ఆమె క్రేజ్ చూసి టాలీవుడ్ అగ్ర దర్శకులు సైతం తమ తదుపరి ప్రాజెక్టుల కోసం ఆమెను సంప్రదిస్తున్నారట.

యంగ్ హీరోల పక్కన సారా అర్జున్ జోడీ అదిరిపోతుందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అప్పుడే ఫిక్స్ అయిపోయారు. చిన్నప్పటి నుంచే వెండితెరపై పెరగడం వల్ల కెమెరా ముందు ఆమె పలికించే హావభావాలు చాలా సహజంగా ఉంటాయి. ఇది ఆమెకు పెద్ద ప్లస్ పాయింట్. పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న ఈ కాలంలో, అన్ని భాషల వారికీ సుపరిచితమైన ముఖం కావడం సారాకు కలిసొచ్చే అంశం. టాలీవుడ్‌కు ఒక కొత్త గోల్డెన్ లెగ్ దొరికిందని ఫిలిం నగర్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. ఈ ధురందర్ బ్యూటీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Updated Date - Dec 27 , 2025 | 05:35 PM