సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Friendship Day Spl: తారల స్నేహబంధంతో అభిమానులకూ ఆనందం!

ABN, Publish Date - Aug 03 , 2025 | 08:41 AM

తెలుగు చిత్రసీమలో తరతరాలుగా ఎంతోమంది స్నేహగీతం పాడుతూ పయనించారు... ఈ తరం స్టార్స్ మధ్య స్నేహబంధం మరింత గట్టిగా పెనవేసుకుందని చెప్పవచ్చు... న

తెలుగు చిత్రసీమలో తరతరాలుగా ఎంతోమంది స్నేహగీతం పాడుతూ పయనించారు... ఈ తరం స్టార్స్ మధ్య స్నేహబంధం మరింత గట్టిగా (Friendship day)పెనవేసుకుందని చెప్పవచ్చు... నవతరం తెలుగు సినిమా తారల్లో స్నేహబంధం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవారు జూనియర్ యన్టీఆర్ (NTR)- రామ్ చరణ్‌ (Ram charan) అనే చెప్పాలి... బాక్సాఫీస్ వద్ద పోటీగా సాగే ఈ హీరోలిద్దరూ నిజజీవితంలో మంచి స్నేహితులు.. ఆ అనుబంధంతోనే 'ట్రిపుల్ ఆర్'లో కలసి నటించగలిగారు... అలాగే జూనియర్ తో అల్లు అర్జున్ కూడా ఎంతో స్నేహంగా ఉంటారు... ఇద్దరూ 'బావా' అంటూ ఒకరినొకరు పిలుచుకొని తమ స్నేహాన్ని చాటుకుంటూ ఉన్నారు... అల్లు అర్జున్ - నవదీప్ మంచి మిత్రులు... రామ్ చరణ్ - రానా బాల్యమిత్రులు... అలాగే చెర్రీకి శర్వానంద్ తోనూ స్నేహబంధం ఉంది... తమ కంటే వయసులో పెద్దవాడైనా రాజమౌళిని మంచి మిత్రునిగా భావిస్తారు తారక్... 

  

తెరపైనే అలా...

 ప్రస్తుతం ఇంటర్నేషనల్  స్టార్ గా సాగుతున్నప్రభాస్, ఈ తరం యాంగ్రీ యంగ్ మేన్ గోపీచంద్ కూడా మంచి మిత్రులు... 'వర్షం'లో హీరో-విలన్ గా నటించిన ప్రభాస్, గోపీచంద్ నిజజీవితంలో ఒకరినొకరు ప్రేమించుకొనే ప్రాణస్నేహితులు... ఒకరి విజయాలకు మరొకరు పొంగిపోతూ ఉంటారు... ఈ విషయాన్ని వారిద్దరూ గతంలో బాలకృష్ణ నిర్వహించే 'అన్ స్టాపబుల్ షో'లోనూ చాటుకున్నారు... 

 అందరికీ ఆనందం పంచేలా...

స్నేహంలోని తీయదనం ఒక్కసారి రుచి చూస్తే చాలు అది అలా అలా కొనసాగుతూనే ఉంటుందంటారు... పవన్ కళ్యాణ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి మంచి మిత్రులు... ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ తోనూ పవన్ స్నేహబంధం బలంగానే సాగుతోంది...  టాప్ స్టార్స్ లో చిరంజీవి- బాలకృష్ణ మంచి మిత్రులు... చిరంజీవికి మరో టాప్ స్టార్ నాగార్జునతోనూ మంచి అనుబంధం ఉంది... వెంకటేశ్ అందరితోనూ స్నేహంగా ఉంటారు... నవతరంలో బోలెడు మంది హీరోలు, ఎంతోమంది హీరోయిన్స్ స్నేహగీతం పాడుతూ సాగుతున్నారు... అలాగే స్టార్స్ తో టెక్నీషియన్స్  స్నేహాలు కూడా ఎన్నదగ్గవి ఉన్నాయి... నిర్మాతలు, దర్శకుల్లోనూ ఎందరో మైత్రీబంధం పెనవేసుకున్నవారు ఉన్నారు...  అందరూ ఆగస్టు 3న ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పొచ్చు... 

 

Updated Date - Aug 03 , 2025 | 09:51 AM