సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tirumala: తిరుమ‌ల‌కు.. క్యూ క‌ట్టిన సెల‌బ్రిటీలు! శ్రీలీల‌తో సెల్ఫీ కోసం.. ఎగ‌బ‌డ్డ జ‌నం

ABN, Publish Date - Dec 30 , 2025 | 04:28 PM

వైకుంఠ ఏకాదశిని పుర‌స్క‌రించుకుని సామాన్య భ‌క్తుల ద‌గ్గ‌రి నుంచి రాజ‌కీయ నాయ‌కులు, వ్యాపార‌వేత్త‌లు, సినీ సెల‌బ్రిటీలు ఆల‌యాల‌కు క్యూ క‌ట్టారు.

ఈ రోజు (మంగ‌ళ‌వారం) వైకుంఠ ఏకాదశి (Vykunta Ekadashi) ని పుర‌స్క‌రించుకుని సామాన్య భ‌క్తుల ద‌గ్గ‌రి నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల‌ రాజ‌కీయ నాయ‌కులు, వ్యాపార‌వేత్త‌లు, సినీ సెల‌బ్రిటీలు, టీం ఇండియా క్రికెట‌ర్లు తిల‌క్ వ‌ర్మ‌, సూర్య కుమార్ యాద‌వ్‌ ఆల‌యాల‌కు క్యూ క‌ట్టారు.


ముఖ్యంగా తెలుగు మూవీ స్టార్స్ శ్రీలీల‌, శివాజీ, మెగా స్టార్ ఫ్యామిలీ నుంచి చిరంజీవి సతీమణి సురేఖ (Surekha), నంద‌మూరి బాల‌కృష్ణ స‌తీమ‌ణి వ‌సుంధ‌ర‌, నారా రోహిత్ జంట‌, మాజీ మంత్రి రోజా, ఓజీ నిర్మాత దాన‌య్య‌, న‌టి హేమ‌, బండ్ల గ‌ణేశ్‌ ఇలా అనేక మంది ఈ రోజు వేకువ జామునే తిరుమ‌ల (Tirumala) శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా ద‌ర్శ‌ణం చేసుకున్నారు.


ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి. అయితే.. శ్రీలీల స్వామి వారి ద‌ర్శ‌ణం చేసుకుని తిరిగి వెళ్లిపోతున్న క్ర‌మంలో అభిమానుల తాకిడి ఒక్క‌సారిగా ఎక్కువయింది. వెంటే సెక్యూరిటీ గార్డ్స్ ఉండి ప‌బ్లిక్‌ను అదుపు చేసే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ చాలామంది ఫొటోలు,సెల్పీల కోసం ఎగ‌బ‌డ్డారు.

Updated Date - Dec 30 , 2025 | 04:39 PM