Samantha weds Raj Nidimoru: ఘనంగా.. సమంత, రాజ్ నిడమోరు పెళ్లి!
ABN, Publish Date - Dec 01 , 2025 | 07:51 AM
సోషల్ మీడియాలో తాజాగా ఓ వార్త సంచలనం రేపుతుంది. ఇందుకు సంబంధించిన న్యూస్ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి.
సోషల్ మీడియాలో తాజాగా ఓ వార్త సంచలనం రేపుతుంది. గత కొంతకాలంగా నిత్యం ఏదో ఒక వార్తలో ప్రధానంగా కనిపిస్తూ వస్తున్న అగ్ర కథానాయిక సమంత మరోసారి ఈ రోజు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన న్యూస్ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. ఇన్నాళ్లు తమపై వచ్చిన వార్తలను నిజం చేశారు.
విషయానికి వస్తే.. సమంత (Samantha Ruth Prabhu) ఏడాదిగా పైగా దర్శకుడు రాజ్ నిడమోరు (Raj Nidimoru) తో తరుచూ కనిపిస్తూ అనేక రూమర్లకు అస్కారం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సోమవారం వీరిరువురు కోయంబత్తూరు (Coimbatore) లోని సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadguru) ఇషా పౌండేషన్ యోగా సెంటర్ (Isha Yoga Centre)లో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.. దీంతో సమంత పేరు నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో రాజ్ భార్య శ్యామలి.. తెగించిన వారు ఇలాంటి పనులే చేస్తారని చేసిన కామెంట్లు సైతం ఇప్పుడు ఈ వార్తలకు బలం చేకూరేలా ఉండడం విశేషం. అయితే.. ఇప్పటివరకు ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. సమంత, రాజ్ సైతం స్పందించలేదు.. అలాగని ఖండించలేదు.
కానీ.. తమ పెళ్లిపై వైరల్ అయిన వార్తలను కూడా ఈ జంట నిజం చేశారు. ఈ ఉదయమే ఇషా ఫౌండేషన్ సెంటర్‌లోని భైరవి ఆలయంలో రాజ్ సమంత మెడలో తెలుగు సాంప్రదాయం ప్రకారం తాళి కట్టాడని న్యూస్ బయటకు వచ్చేసింది. ఇందుకు సంబంధించిన వార్తను ఈ సాయంత్రమే సమంత అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలామంది అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.