Anushka Shetty: బాహుబలి రీయూనియన్.. దేవసేన రాకపోవడానికి అదే కారణమా..

ABN , Publish Date - Jul 11 , 2025 | 06:03 PM

ఒక సినిమా హిట్ అయ్యింది అంటే.. అది కేవలం ఒక్క హీరో వలనే కాదు హీరోయిన్ కు కూడా కొంత భాగం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని సినిమాల్లో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో హీరోయిన్ కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది.

Anushka

Anushka Shetty: ఒక సినిమా హిట్ అయ్యింది అంటే.. అది కేవలం ఒక్క హీరో వలనే కాదు హీరోయిన్ కు కూడా కొంత భాగం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని సినిమాల్లో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో హీరోయిన్ కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అసలు ఆమె లేనిదే కొన్ని సినిమాలను ఊహించుకోలేము అని కూడా చెప్పొచ్చు. అలాంటి సినిమాల్లో బాహుబలి (Bahubali) ఒకటి. బాహుబలి అనగానే ప్రభాస్(Prabhas), రానా, రాజమౌళి గుర్తొస్తారు. వారితో పాటు దేవసేన అదేనండీ అనుష్క శెట్టి (Anushka Shetty)కూడా గుర్తొస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.


కొన్ని పాత్రలు కొంతమంది కోసమే పుడతాయి అని అనుకుంటే .. దేవసేన అనే పాత్ర కేవలం అనుష్క కోసమే. పుట్టింది. ఆమె తప్ప ఇంకెవరూ ఆ పాత్రలో కనిపించలేరు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అందమే అసూయ పడేంత అందం.. రాణి రాజసం.. బాహుబలి లాంటి వీరుడిని సైతం కొంగుకు కట్టేసేంత తెగింపు ఆమె సొంతం. అందుకే దేవసేనగా అనుష్కను తప్ప ఎవరిని ఊహించుకోలేము కూడా. బాహుబలి పార్ట్ 1 లో పుల్లలు ఏరుకున్నా.. పార్ట్ 2 లో కత్తి దూసినా కూడా ప్రేక్షకులు ఆమెకు పట్టం కట్టారు.


దేవసేన అందం చూసి టాలీవుడ్ మొత్తం మురిసిపోయింది. ఇక ఈ సినిమా అనుష్క లైఫ్ ను మొత్తం మార్చేసింది. టాలీవుడ్ యువరాణి అనగానే మిత్రవింద తరువాత దేవసేన అనే చెప్పుకొస్తారు. అయితే అదంతా ఒకప్పుడు అని చెప్పొచ్చు. బాహుబలి పార్ట్ 1 తరువాత సైజ్ జీరో అనే సినిమా చేసింది అనుష్క. ఈ సినిమా కోసం బరువు పెరిగిన స్వీటీ.. ఇప్పటివరకు బరువు తగ్గలేదు. యోగా టీచర్ అయినా కూడా ఆమె తన బరువును కంట్రోల్ చేయలేకపోయింది. దీంతో అలానే ఆమె బరువు పెరుగుతూనే వచ్చింది.


ఇక ఆ బరువే స్వీటీకి శాపంగా మారిందా అంటే నిజమే అని అంటున్నారు అభిమానులు. దానివలన ఆమె బయటకు ఎక్కడకు రాలేకపోతుంది. సినిమాల్లో కూడా సీజీతో స్వీటీని సన్నగా చూపించారు. స్వీటీ ఎలా ఉన్నా కూడా అభిమానులకు ఇష్టమే. కానీ, ట్రోల్స్ ను ఆపడం మాత్రం కష్టమే. అందుకే స్వీటీ బయట ఎక్కువ కనిపించడం లేదు. తాజాగా బాహుబలి రీయూనియన్ సందడి జరిగిన విషయం తెల్సిందే. బాహుబలి రీరిలీజ్ కానున్న సందర్భంలో టీమ్ అంతా కలిసి హంగామా చేశారు. అయితే ఈ టీమ్ లో రాజులు ఉన్నారు కానీ, రాణులు మిస్ అయ్యారు.


అవును.. ఈ రీయూనియన్ లో దేవసేన అనుష్క, అవంతిక తమన్నా మిస్ అయ్యారు. తమన్నా రాకపోవడానికి కారణం ఏదైనా ఎవరు అంతగా పట్టించుకోవడం లేదు కానీ, స్వీటీ ఎందుకు రాలేదని మాత్రం ఆరాలు తీస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. తమన్నా నిత్యం సోషల్ మీడియాలో ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంది. బాహుబలిలో కూడా ఎక్కువ సేపు కనిపించింది లేదు. కానీ, అనుష్క అలా కాదు. బాహుబలికి సగం ప్రాణం దేవసేన. కాబట్టి కచ్చితంగా ఈ టీమ్ లో అనుష్క ఉండాలి. ఆమె బరువు కారణంగానే ఈ వేడుకకు ఆమె హాజరుకాలేదనే మాటలు వినిపిస్తున్నాయి.


మొదట ఈ వేడుకకు స్వీటీ వస్తాను అని చెప్పిందని, ఆ తరువాత పర్సనల్ కారణాల వలన అటెండ్ కాలేనని చెప్పినట్లు సమాచారం. ఏదిఏమైనా బాహుబలి రీయూనియన్ లో అనుష్క లేనిలోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడే స్వీటీ రాలేదు అంటే ముందు ముందు జరిగే ప్రమోషన్స్ లో కూడా అమ్మడు కనిపించదు అనే మాట వినిపిస్తుంది. ఇక స్వీటీ లేకపోవడంతో ఫ్యాన్స్ కొద్దిగా నిరాశకు గురయ్యారు. బాహుబలి పక్కన దేవసేన లేకపోవడం బాధగా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. మరి బాహుబలి రీరిలీజ్ అయ్యేలోపు ఒక్కసారైనా అమరేంద్ర బాహుబలి, దేవసేన, భల్లాలదేవా కలిసి కనిపిస్తారేమో చూడాలి.

Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్యకు సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్

Updated Date - Jul 11 , 2025 | 06:03 PM