Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్యకు సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్
ABN , Publish Date - Jul 11 , 2025 | 04:06 PM
నటి రేణు దేశాయ్ (Renu Desai) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్యగా, ఒకప్పటి హీరోయిన్ గా ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది.
Renu Desai: నటి రేణు దేశాయ్ (Renu Desai) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్యగా, ఒకప్పటి హీరోయిన్ గా ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది. బద్రి సినిమాతో రేణు.. తెలుగుతెరకు పరిచయమైంది. ఆ సినిమా షూటింగ్ లోనే పవన్ తో ప్రేమలో పడి.. పెళ్ళికి ముందే అకీరాకు జన్మనిచ్చింది. ఇక పెళ్లి తరువాత ఈ జంటకు ఆద్య అనే ఆడపిల్ల జన్మించింది. ఇక కొన్నేళ్లు సవ్యంగా నడిచిన వీరి దాంపత్యంలో కలతలు అరవడంతో రేణు.. పవన్ నుంచి విడాకులు తీసుకొని విడిపోయింది.
ప్రస్తుతం రేణు దేశాయ్.. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా నివసిస్తోంది. భర్తకు దూరమయినా కూడా పిల్లలను మాత్రం తండ్రికి,మెగా ఫ్యామిలీకి దగ్గరగానే ఉంచింది. పవన్ రాజకీయాల్లోకి వచ్చాకా ఎక్కువ తండ్రి పక్కనే అకీరా కనిపిస్తున్న విషయం తెల్సిందే. పవన్ రాజకీయాల్లో పూర్తిగా పరిమితమయితే.. సినిమాల్లో తండ్రి లోటును కొడుకు తీరుస్తాడని, అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు. రేణు కూడా.. సినిమాల్లోకి రావడం, రాకపోవడం అంతా అకీరా ఇష్టమని చెప్పడంతో ఆ కుర్రాడు ఎప్పుడు సినిమాల్లోకి వస్తానని చెప్తాడో అని అందరూ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు.
ఇక రేణు విషయానికొస్తే.. ఆమె సమయం దొరికినప్పుడల్లా ఇంటర్వ్యూలు ఇస్తూ తన గురించి, తన జీవితం గురించి ఏదో ఒక విషయాన్నీ చెప్పుకొస్తూనే ఉంటుంది. ఇంకోపక్క సోషల్ మీడియాలో సైతం కొడుకు, కూతురుతో జాలీగా గడిపే క్షణాలను నిత్యం అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా జంతు సంరక్షణ కోసం విరాళాలు సేకరిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా పక్కన పెడితే గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుందని తెలుస్తుంది. ఈ విషయాన్నీ ఆమె పలు ఇంటర్వ్యూల్లో కన్ఫర్మ్ కూడా చేసింది. తనకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని, దానివలనే బరువు పెరిగినట్లు ఆమె చెప్పుకొచ్చింది.
ఇక తాజాగా రేణు దేశాయ్.. తన కూతురు ఆద్యతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది. 'ఎట్టకేలకు సర్జరీ తరువాత నా క్యూటీస్ తో డిన్నర్ చేస్తున్నాను' అని రాసుకొచ్చింది. దీంతో ఈమధ్యనే రేణుకు సర్జరీ అయ్యినట్లు తెలుస్తోంది. ఫొటోలో కూడా రేణు చాలా నీరసంగా కనిపించింది. అయితే సర్జరీ దేనికి.. ? ఆమెకు ఏమైంది.. ? అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. దీంతో అభిమానులు రేణు దేశాయ్ ఆరోగ్యం గురించి కంగారు పడుతున్నారు. రేణుకు ఏమైంది అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఆమె హెల్త్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. రేణు దేశాయ్ త్వరగా కోలుకోవాలని పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Shruti Haasan: రెండు బ్రేకప్స్.. పెళ్లంటే భయమేస్తుందన్న వారసురాలు