సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Theater Movies: ఈ శుక్ర‌వారం.. ఇండియా వైడ్ థియేట‌ర్ల‌కు వ‌స్తున్న సినిమాలివే! స‌గం హ‌ర్ర‌ర్ మూవీసే

ABN, Publish Date - Aug 07 , 2025 | 06:57 PM

ఈ శుక్ర‌వారం మ‌న దేశ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో 50కి పైగా సినిమాలు సంద‌డి చేయ‌నున్నాయి.

Theater Movies

ఈ వారం మ‌న దేశ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో 50కి పైగా సినిమాలు సంద‌డి చేయ‌నున్నాయి. రానున్న వారం వార్‌2, కూలీ వంటి భారీ చిత్రాలు థియేట‌ర్ల‌కు వ‌స్తున్నాయి. ఆపై వినాయ‌క చ‌వితి, ద‌స‌రా సీజ‌న్ స్టార్ట్ కానుండ‌డంతో పెద్ద సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఖాళీ స్లాట్ దొరకడంతో చాలా చిత్రాలు థియేట‌ర్ల బాట ప‌ట్టాయి. వాటిలో హిందీ, త‌మిళం నుంచి తొమ్మిదేసి ,చిత్రాలు తెలుగులో8, క‌న్న‌డ‌లో 7, ఇంగ్లీష్‌లో5, మ‌ల‌యాలంలో 3 మ‌రాఠిలో 2, భోజ్ పురిలో2, గుజ‌రాతిలో మూడేసి సినిమాలు థియేట‌ర్ల‌లో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి సిద్ద‌మ‌య్యాయి.

అయితే వీటిలో హాలీవుడ్ వీప‌న్స్, తెలుగులో వ‌స్తున్న స్టెయిట్ చిత్రం బ‌కాసుర‌, మాతృ సినిమాల‌తో పాటు క‌న్న‌డ డ‌బ్బింగ్ చిత్రం సూ ఫ్రం సో, సురేశ్ గోపి, అనుప‌మ న‌టించిన‌ మల‌యాళ డ‌బ్బింగ్ చిత్రం జాన‌కి వ‌ర్సెస్ కేర‌ళ వంటి మూవీస్‌పై మాత్ర‌మే అంచ‌నాలు ఉన్నాయి. ఇదిలాఉండ‌గా మ‌హేశ్ బాబు జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని అత‌డు సినిమాను ఆగ‌స్టు9న రీ రిలీజ్ చేస్తుండ‌గా ఇప్ప‌టికే చాలా చోట్ల బుకింగ్స్ సైతం హౌస్‌ ఫుల్ కావ‌డం విశేషం. ఇక మిగతా సినిమాల‌న్నీ ఆగ‌స్టు8న‌ ఆయా భాష‌ల వారీగా అక్క‌డి ప్రాంతాల‌లో రిలీజ్ కానున్నాయి.

ఇదిలాఉంటే ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో ఫ‌స్ట్ టైం హాలీవుడ్ నుంచి 6 సినిమాలు విడుద‌ల‌వుతుండ‌గా అందులో 5 హ‌ర్ర‌ర్ జాన‌ర్ కావ‌డం విశేషం. వీటిలో పాటు తెలుగులో అనువాద‌మై వ‌స్తోన్న క‌న్న‌డ చిత్రం సూ ఫ్రం సో, క‌మెడియ‌న్ ప్ర‌వీణ్ న‌టించిన బ‌కాసుర రెస్టారెంట్, బ్లాక్ నైట్‌ చిత్రాలు సైతం హ‌ర్ర‌ర్ సినిమాలే కావ‌డం గ‌మ‌నార్హం. ఇలా మొత్తంగా ఈ ఆగ‌స్టు8న విడుద‌ల కానున్న సినిమాల్లో అధిక శాతం భ‌య‌పెట్టే చిత్రాలే కావ‌డం యాదృశ్చిక‌మా లేక వాళ్ల‌కు ఆ ద‌య్యాలే ఆవ‌హించి ఈ డేట్ ఏమైనా ఫిక్స్ చేశాయా ఏంటి అనే అనుమానం రాక మాన‌దు.


ఈ శుక్ర‌వారం.. థియేట‌ర్ల‌కు వ‌స్తున్న సినిమాలివే

English

Together

Weapons

The Home

Sorry, Baby

Holy Ghost

Freakier Friday

Hindi

Zora

Rajveer

Together

Mcguffin

Andaaz 2

Ghich Pich

Freakier Friday

Sundarnagar Ki Sundari

Udaipur Files: Kanhaiya Lal Tailor Murder

Telugu

Mathru

Su From So

Black Night

Bhalare Sitram

Raju Gaani Savaal

Bakasura Restaurant

Balu Gadi Love Story

Janaki vs State of Kerala

Malayalam

Mehfil

Sahasam

Sangarsha Ghadana - Art of Warfare

Tamil

Vaanaran

Maamaram

Red Flower

Raagu Kethu

Thangakottai

Uzhavar Magan

Bhai: Sleeper Cell

Maheshwaran Magimai

Kathuvaakula Oru Kadhal

Kannada

Custody

Karavali

Palguni

Rajadrohi

Bharavase

Premigala Gamanakke

10 Ne Classu Swalpa Massu

Bhojpuri

Love Station

Pawan Ki Chandani

Marathi

Jitraab

Vaajav Re

Gujarati

Varta

Call 104

Ladies First

Khalid Ka Shivaji

Punjabi

Kuriyan Jawan Bapu Preshaan 2

Updated Date - Aug 07 , 2025 | 07:20 PM