Theater Movies: శుక్రవారం, Dec 25.. ఇండియా వ్యాప్తంగా థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే
ABN, Publish Date - Dec 22 , 2025 | 07:34 PM
ఈ వారం థియేటర్లలో సినిమాల సందడి అంతకుమించి అనే రేంజ్‌లో ఉంది.
ఈ వారం థియేటర్లలో సినిమాల సందడి అంతకుమించి అనే రేంజ్‌లో ఉంది. క్రిస్మస్, ఇయర్ ఎండ్ నేపథ్యంలో కలిసి వస్తుందనే భావనతో మేకర్స్ అంతా ఈ డిసెంబర్ 25నే అనేక చిత్రాలు రిలీజ్‌కు సిద్దం చేశారు. వీటిలో ఒక్క తెలుగు నుంచే 9 సినిమాలు విడుదల అవుతున్నాయి.
ఇందులో ఆరు తెలుగు స్టెయిట్ చిత్రాలు మలయాళం, కన్నడ, హాలీవుడ్‌ల నుంచి ఒక్కోటి చొప్పున మూడు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఇక మలయాళం నుంచి 4, తమిళం, బెంగాలీ, హిందీ బాషల నుంచి మూడేసి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఇదిలాఉంటే.. ఈ వారం తెలుగులో వస్తున్న తొమ్మది చిత్రాలలో దేనిని తీసి పడేయడానికి వీలు లేకుండా అన్ని ప్రమోషన్ల పరంగా, కంటెంట్ పరంగా ఇప్పటికే వీక్షకుల నుంచి మంచి ఆదరణను దక్కించుకున్నాయి. పైగా కంటెంట్ పరంగా కూడా ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి.
అయితే వీటికి తోడు హాలీవుడ్ నుంచి ఆనకొండ చిత్రం రావడం కూడా సినీ లవర్స్‌లో క్యూరియాసిటీని పెంచుతోంది. దీనికితోడు ఈ వారం అర డజన్‌కు పైగా చిత్రాలు రిలీజ్ అవుతుండడంతో ఏ సినిమా జనాధరణను దక్కించుకుంటుందో అనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా తయారైంది.
ఈ వారం.. థియేటర్ సినిమాలు
English
Anaconda
Tamil
Sirai
Anaconda
Retta Thala
Malayalam
Aghosham
Vrusshabha
Sarvam Maya
Valathu Vasathe Kallan
Telugu
Mark
Eesha
Patang
Bad Girlz
Anaconda
Champion
Shambhala
Dhandoraa
Vrusshabha
Hindi
Anaconda
Vrusshabha
Tu Meri Main Tera Main Tera Tu Meri
Kannada
45
Mark
Anaconda
Vrusshabha
Lucky Charlie
Gujarati
Vande Bharat Via USA
Konkani
Aai Saiba
Marathi
Gotya Gangster
Savitri Kalyugatali
Bengali
Projapati 2
Lawho Gouranger Naam Rey
Mitin: Ekti Khunir Sandhaney