సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Summer Movies: సమ్మర్ లో కుర్ర హీరోల సందడి.. గెలిచేది ఎవరు

ABN, Publish Date - Nov 11 , 2025 | 07:17 PM

డిసెంబర్ దబిడి దిబిడి ఇంకా చూడలేదు. సంక్రాంతి సందడి సాగలేదు. అప్పుడే సినీజనం చూపు వేసవి చిత్రాలవైపు సాగుతూ ఉండడం విశేషం.

Summer Movies

Summer Movies: డిసెంబర్ దబిడి దిబిడి ఇంకా చూడలేదు. సంక్రాంతి సందడి సాగలేదు. అప్పుడే సినీజనం చూపు వేసవి చిత్రాలవైపు సాగుతూ ఉండడం విశేషం. సమ్మర్ లో సందడి చేసే హీరో ఎవరో అంటూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏ సినిమా రంగానికైనా ఫెస్టివల్స్ సీజన్స్ కలసి వస్తాయి. వాటిని మించి అచ్చివచ్చే సీజన్ సమ్మర్ అనే చెప్పాలి. ఏప్రిల్ నాటికి వేసవి సెలవులు పలకరిస్తాయి. అవి దాదాపు జూన్ 12 దాకా ఉంటాయి. అందువల్ల పిల్లలకు సెలవులు అధికంగా ఉండే వేసవిలోనే పలు సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తాయి. ఈ యేడాది పలు చిత్రాలు వేసవిలో జనం ముందుకు రానున్నాయి.


ముందుగా అడివి శేష్ నటించిన 'డెకాయిట్' మార్చి 19న రిలీజ్ కానుంది. అదే రోజున కన్నడ స్టార్ యశ్ తాజా చిత్రం 'టాక్సిక్' కూడా వెలుగు చూడనుంది. రాబోయే యేడాది మార్చి 27వ తేదీన రామ్ చరణ్ 'పెద్ది' రిలీజ్ కానుంది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ తో భలేగా అలరిస్తోన్న 'పెద్ది' రిలీజ్ నాటికి ఇంకా ఎంత క్రేజ్ సంపాదిస్తుందో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. 'పెద్ది' వచ్చిన వారానికి అంటే ఏప్రిల్ 4వ తేదీన విశ్వక్సేన్ 'ఫంకీ' విడుదల కానుంది... టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ప్రస్తుతానికి సమ్మర్ ను ఎంచుకున్నది రామ్ చరణ్ ఒక్కరే అని చెప్పాలి.


వేసవిపై ఆశలు పెట్టుకున్న స్టార్స్ మరికొందరు ఉన్నారు- కార్తిక్ వర్మ డైరెక్షన్ లో నాగచైతన్య నటిస్తున్న మూవీ సమ్మర్ కే రానుందని తెలుస్తోంది. మరో అక్కినేని హీరో అఖిల్ నటిస్తోన్న 'లెనిన్' కూడా ఎండాకాలంలోనే సందడి చేయనుందట. కొరియన్ కథతో తెరకెక్కుతోన్న వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ సినిమా, సాయిధరమ్ తేజ్ నటించిన 'సంబరాల ఏటిగట్టు' కూడా సమ్మర్ పైనే ఆశలు పెట్టుకున్నాయి. అలాగే శర్వానంద్ 'భోగి', నిఖిల్ 'స్వయంభు' కూడా వేసవి సందడిలోనే పాలు పంచుకోనున్నాయి.


కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ', బెల్లంకొండ సాయిశ్రీనివాస్ 'హైందవ', ఆనంద్ దేవరకొండ పేరు నిర్ణయించని సినిమా కూడా వేసవి బరిలోనే దూకడానికి సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి సమ్మర్ ను టార్గెట్ చేసుకున్న చిత్రాలు ఇవేనంటూ వినిపిస్తోంది. ఇవి కాకుండా సీనియర్ స్టార్స్ నటించే సినిమాలేవైనా సమ్మర్ లోనే వెలుగు చూడవచ్చనీ సమాచారం. మరి ఈ సారి సమ్మర్ లో విశేషంగా సందడి చేసి టాప్ హిట్ ను ఎవరు పట్టేస్తారో చూడాలి.

Updated Date - Nov 11 , 2025 | 07:28 PM