సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kingdom: ఆగిపోయిన మరో సీక్వెల్..

ABN, Publish Date - Dec 06 , 2025 | 03:42 PM

ఈ మధ్యకాలంలో ప్రతి సినిమా చివరన సీక్వెల్ ఉంది అని చెప్పడం ట్రెండ్ గా మారిపోయింది. అందులో కథ ఉండదు..

Kingdom

Kingdom: ఈ మధ్యకాలంలో ప్రతి సినిమా చివరన సీక్వెల్ ఉంది అని చెప్పడం ట్రెండ్ గా మారిపోయింది. అందులో కథ ఉండదు.. ఏం ఉండదు. సినిమా హిట్ అయ్యి.. అభిమానులు సీక్వెల్ అడిగితే అప్పుడు ఆ కథను డెవలప్ చేయడానికి రెడీ అవుతున్నారు డైరెక్టర్స్. ఇంకొందరు మాత్రం పెద్ద కథను.. ఒకే పార్ట్ లో చూపించలేక.. రెండో భాగంలో చూపిస్తామని చెప్పుకొస్తున్నారు. అయితే మొదటి భాగం హిట్ అవ్వకపోతే ఆ సీక్వెల్ గురించి పట్టించుకునేవారే ఉండరు. అలా ఎన్నో సినిమాల సీక్వెల్స్ ఆగిపోయాయి. ఆ లిస్ట్ లో కింగ్డమ్ (Kingdom) కూడా చేరింది.

లైగర్ లాంటి డిజాస్టర్ నుంచి కోలుకోవడానికి విజయ్ దేవరకొండ ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఒకటి కాదు రెండు కాదు సినిమాలు చేస్తూనే వస్తున్నాడు కానీ, విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఖుషి, ఫ్యామిలీ స్టార్, కింగ్డమ్.. ఇలా వచ్చిన ప్రతి సినిమా విజయ్ కి పరాజయాన్ని అందించిందే. ఈ ఏడాది రిలీజ్ అయిన కింగ్డమ్ పై విజయ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. జెర్సీ లాంటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈ సినిమా విజయ్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచిపోతుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, కింగ్డమ్.. విజయ్ కి పరాజయాన్నే అందించింది.

కింగ్డమ్ చివర్లో దీనికి సీక్వెల్ ఉంటుంది అని డైరెక్టర్ ప్రకటించాడు. ఇక ఈ సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ ఆగిపోయిందని తెలుస్తోంది.గౌతమ్, విజయ్ కూడా సీక్వెల్ పై ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో సితార కూడా దీని గురించి పట్టించుకోవడం మానేసింది. ఎలాగో మొదటి పార్ట్ ప్లాప్ అయ్యింది కాబట్టి అభిమానులు కూడా సీక్వెల్ గురించి మర్చిపోతారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి మ్యాజిక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలతోనైనా విజయ్ విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.

Updated Date - Dec 06 , 2025 | 03:43 PM