Akkineni Nagarjuna: నిరాశలో అక్కినేని ఫ్యాన్స్.. నాగ్ ఇలా చేస్తాడనుకోలేదు
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:30 PM
స్టార్ హీరోల పుట్టినరోజుల కోసం అభిమానులు ఎందుకు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తారో తెలుసా..
Akkineni Nagarjuna: స్టార్ హీరోల పుట్టినరోజుల కోసం అభిమానులు ఎందుకు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తారో తెలుసా.. హీరోల కొత్త సినిమా అప్డేట్స్ వస్తాయని.. రిలీజ్ కాబోయే సినిమాలు నుంచి పోస్టర్స్.. కొత్త సినిమాను అనౌన్స్ చేయడం, పూజా కార్యక్రమాలు మొదలుపెట్టడం.. కనీసంలో కనీసం ఫ్యాన్స్ తో ఆ విషయాన్నీ అయినా చెప్తారని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. కానీ, ఈసారి అక్కినేని అభిమానులకు ఇవేమి దక్కలేదు. కింగ్ నాగార్జున (Nagarjuna) నిన్న తన 67 వ బర్త్ డే జరుపుకున్న విషయం తెల్సిందే.
ఈ ఏడాది నాగ్ కు చాలా ప్రత్యేకమని చెప్పాలి. హీరోగా కాకపోయినా.. డిఫరెంట్ రోల్స్ లో కనిపించి ప్రేక్షకులను ఫిదా చేశాడు. కుబేర, కూలీ సినిమాలతో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. అంతేనా ఈ ఏడాదితోనే నాగ్ 99 సినిమాలను ఫినిష్ చేసి.. తన 100 వ సినిమాను మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పటినుంచో నాగ్ 100 వ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. సాధారణంగా స్టార్ హీరో మైల్ స్టోన్ సినిమా అంటే అభిమానులకు అంచనాలు ఉండడం చూస్తూనే ఉంటాం.
ఇక అక్కినేని అభిమానులు కూడా అలాగే నాగ్ 100 వ సినిమాపై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. తన 100 వ సినిమా కోసం నాగ్ కష్టపడ్డాడా.. ? అంటే ఏమో తెలియడం లేదు అనే సమాధానం వినిపిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం నాగ్ చాలా కథలు విని చివరకు రా. కార్తీక్ అనే తమిళ్ డైరెక్టర్ తో నాగ్ తన 100 వ చిత్రాన్ని పట్టాలెక్కించడానికి సిద్దమవుతున్నాడు. ఇక ఇదే అభిమానులకు మింగుడు పడడం లేదు. ఎంతోమంది స్టార్ డైరెక్టర్స్ ను వదిలేసి.. కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న డైరెక్టర్ తో సినిమా చేయడమేంటి అని అడుగుతున్నారు.
సరే చేస్తే చేసారు.. కనీసం బర్త్ డే రోజు అయినా ఒక్క అప్డేట్ అయినా ఉండాలి కదా. అసలు నిన్న నాగ్ బర్త్ డే అన్న మాటే కానీ, ఒక అప్డేట్ లేదు.. ఒక పోస్టర్ లేదు. నాగ్ 100 వ సినిమా నుంచి కచ్చితంగా ఈరోజు అప్డేట్ వస్తుంది అనుకున్న అభిమానులకు నిరాశనే మిగిలింది, సరే.. తండ్రిది ఎలాగూ లేదు.. కనీసం కొడుకులు అఖిల్, నాగ చైతన్య సినిమాల నుంచి అయినా అప్డేట్ ఇవ్వొచ్చు కదా. అందులోనూ అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమాకు నాగ్ నే నిర్మాత. అలా అయినా ఒక పోస్టర్ రిలీజ్ చేయొచ్చు.. అది కూడా చేయలేదు.
ఇలా నాగ్ కు సంబంధించిన ఏ అప్డేట్ కూడా ఆయన పుట్టినరోజున రాలేదు. కనీసం నాగ్ కూడా దీనిపై స్పందించలేదు. దీంతో ఫ్యాన్స్ ఇలా చేస్తావనుకోలేదు కింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి నాగ్ 100 వ సినిమాకు ముహూర్తం ఎప్పుడో.. ఏంటో తెలియాలంటే కొన్నిరోజులు ఓపిక పట్టాల్సిందే.
Allu Kanakaratnam: ముగిసిన కనకరత్నమ్మ అంత్యక్రియలు.. పాడె మోసిన మనవళ్లు
Sai abhyankkar: బన్నీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ సాంగ్ ఎలా ఉందంటే..