Aadi Saikumar: క్రిస్మస్ కు రాబోతున్న 'శంబాల'

ABN , Publish Date - Oct 18 , 2025 | 05:14 PM

ఆది సాయికుమార్ తాజా చిత్రం 'శంబాల' ఈ యేడాది చివరి వారాంతంలో విడుదల కాబోతోంది. దీన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నారు మేకర్స్.

Sambhala movie

ఈ యేడాది చివరి వారాంతంలో థియేటర్లలో సందడి చేసే సినిమాల సంఖ్య నిదానంగా పెరుగుతోంది. ఇప్పటికే డిసెంబర్ 25 గురువారం రోజున క్రిస్మస్ కానుకగా అడివి శేష్ (Adivi Shesh) 'డకాయిట్' (Dacoit) మూవీ వస్తుందనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడీ సినిమా వచ్చే యేడాదికి వాయిదా పడిందని సమాచారం. దాంతో ఇదే రోజున శ్రీకాంత్, ఊహ కుమారుడు రోషన్ నటించిన 'ఛాంపియన్' (Champion) మూవీని సీనియర్ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. అలానే విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ తెరకెక్కించిన 'ఫంకీ' (Funky) సినిమా సైతం క్రిస్మస్ కు వస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీనితో పాటు 'అనకొండ : రిటర్న్స్' అనే ఆంగ్ల చిత్రమూ అదే రోజు రాబోతోంది. తాజాగా ఆది సాయికుమార్ (Aadi Saikumar) నటిస్తున్న 'శంబాల' (Shambala) సినిమాను సైతం తెలుగు, హిందీ భాషల్లో డిసెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ తెలిపారు.


యంగ్ అండ్ వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల'. ఎ మిస్టికల్ వరల్డ్ అనేది దీని ట్యాగ్ లైన్. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు ఈ ‘శంబాల’ నుంచి వచ్చిన పోస్టర్‌లు, పాత్రల్ని రివీల్ చేస్తున్న తీరు అందరిలోనూ ఆసక్తిని పెంచుతూ వచ్చింది. అలానే 'శంబాల' మేకింగ్ వీడియో, టీజర్ కూడా సినిమా చూడాలనే ఉన్నాయి.


అంతరిక్షం నుంచి ఏదో ఒక అతీంద్రయ శక్తి ఉన్న ఉల్క, రాయి లాంటిది ఓ గ్రామంలో పడటం.. దాని ప్రభావంతో ఊర్లోని జనాలు చనిపోవడం, వింతగా ప్రవర్తించడం జరుగుతుంటుంది. దాన్ని ఛేదించేందుకు హీరో రావడం... ఓ ఊరితో పోరాటం చేయడం వంటి ఆసక్తికరమైన అంశాలతో 'శంబాల'ను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. మరి క్రిస్మస్ కానుకగా వస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుంది, అదే రోజు రాబోతున్న సినిమాలకు దీటుగా ఎలా నిలుస్తుంది అనేది చూడాలి.

Also Read: Prabhas: 'ది రాజా సాబ్'.. మళ్ళీ వాయిదా?

Also Read: Pawan kalyan: ఫ్యాన్స్ కు పండగ.. మరో రెండు సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్

Updated Date - Oct 18 , 2025 | 05:15 PM